వైఎస్సార్ బయోపిక్ లో "జగన్" భార్యగా నటించబోయే టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా.?    2018-05-25   02:15:37  IST  Bhanu C

మహి రాఘవ్ డైరెక్షన్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు యాత్ర అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. అయితే ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ కూడా ఇటీవల రిలీజ్ అయి వైఎస్సార్ అభిమానులను ఆకట్టుకుంది.

ఈ సినిమాలో వైఎస్ తనయుడు జగన్ పాత్రలో స్టార్ హీరో సూర్య నటించనున్నారని వార్త బయటకు వచ్చింది. అయితే సూర్య ఈ పాత్రలో నటించడం అనేది చాలా మంచి విషయమని కానీ తాము ఇంతవరకూ సూర్యను అప్రోచ్ అవలేదని మహి తెలిపారు. ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే ఓ కీలక పాత్రలో పోసాని కృష్ణమురళి నటిస్తున్నారని మహి వెల్లడించారు. పోసానిది ఓ కల్పిత పాత్ర అని కానీ ఈ పాత్ర చాలా ఇంపార్టెంట్ అని మహి స్పష్టం చేశారు.