కీర్తి సురేష్‌కు అవి అంటే మహా సిగ్గంటా..!     2018-06-30   23:55:58  IST  Raghu V

ప్రస్తుతం ఏ సినిమా పరిశ్రమలో అయినా హీరోయిన్స్‌ అంటే గ్లామర్‌ డాల్స్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గ్లామర్‌గా కనిపిస్తేనే నాలుగు సినిమాల్లో అవకాశాలు వస్తాయనే విషయం అందరికి తెల్సిందే. అయితే కొందరు హీరోయిన్స్‌ మాత్రం వచ్చిన కొత్తలో స్కిన్‌ షోకు నో చెబుతూ, పొట్టి డ్రస్‌లు వేసుకోను, కిస్‌ సీన్స్‌కు ఒప్పుకోను, బికినీ అస్సలే వేసుకోను అంటూ వస్తుంటారు. అందులో కొందరు కొన్నాళ్ల తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకుంటారు. మరి కొందరు తమ నిర్ణయానికి కట్టుబడి ఉండటం వల్ల హీరోయిన్‌గా అవకాశాలు రాక ఫేడ్‌ ఔట్‌ అవుతారు.

తెలుగులో నిత్యామీనన్‌కు మంచి పేరు దక్కింది. అయితే ఆమె స్కిన్‌ షోకు నో చెప్పడంతో పాటు, రొమాంటిక్‌ సీన్స్‌కు ఒప్పుకోక పోవడంతో నటన పరంగా మంచి ట్యాలెంటెడ్‌ అయినా కూడా ఫేడ్‌ ఔట్‌ అవుతూ వస్తుంది. మరో సంవత్సరంలో నిత్యామీనన్‌ పూర్తిగా సినిమాలకు దూరం అయ్యే అవకాశం ఉంది. ఇక నిత్యామీనన్‌ దారిలోనే కీర్తి సురేష్‌ కూడా సాగే అవకాశం కనిపిస్తుంది. తెలుగులో ఈ అమ్మడు నేను శైలజ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. తాజాగా ‘మహానటి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈమెకు భారీ క్రేజ్‌ ఉంది. తెలుగు మరియు తమిళంలో స్టార్‌ హీరోల సరసన నటిస్తూ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న కీర్తి సురేష్‌ ఎంత పారితోషికం ఇచ్చినా కూడా రొమాంటిక్‌ సీన్స్‌కు మాత్రం నో చెబుతూ వస్తుంది.