ఆ పదవిపై కేసీఆర్ కన్ను ! మోదీతో మంతనాలు అందుకేనా ..?     2018-06-19   03:38:49  IST  Bhanu C

బీజేపీపై అవకాశం కుదిరినప్పుడల్లా విరుచుకుపడిపోయే కేసీఆర్ కొంతకాలంగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు. పైకి ఇలాగే వ్యవహరిస్తున్నా .. లోలోపల మాత్రం లోపాయకారి ఒప్పందం ఏదో ఉన్నట్టు చాలాకాలంగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ ప్రధాని మోడీని కలవటం.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు.. పెండింగ్ విషయాల మీద చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఇదంతా ఉత్తిదే అని కేసీఆర్ ప్రధానిని కలవడం వెనుక రాజకీయం వేరే ఉందని తెలుస్తోంది.

కేసీఆర్ టూర్ వెనుక అసలు ఉద్దేశం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి అని అది ఎలాగైనా తమ పార్టీకి చెందిన సీనియర్ నేత ఎంపీ కె. కేశవరావుకు ఇచ్చేలా కేసీఆర్ పావులు కదుపుతున్నట్లుగా చెబుతున్నారు. డిఫ్యూటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న కురియన్ పదవీ కాలం ముగియబోతుండడంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా బీజేపీయేతర పార్టీకి అవకాశమిస్తే అది తమ పార్టీకి ఇవ్వాల్సిందిగా కేసీఆర్ ప్రధానిని కోరినట్టు సమాచారం.