బిత్తిరిసత్తి... ఎమ్యెల్యే అభ్యర్థి ... కేసీఆర్ ఆఫర్ ఇచ్చాడా     2018-09-11   09:40:44  IST  Sainath G

తెలంగాణ ముందస్తు ఎన్నికల సందడిలో చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ కోసం కష్టపడి టికెట్ వస్తుందని ఆశించిన చాలామందికి మొండిచెయ్యి చూపించాడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని వారికి కూడా టికెట్ దక్కబోతోందని, అతనొస్తే పార్టీకి కూడా కలిసి వస్తుందని కేసీఆర్ ఆలోచనట. తెలంగాణ యాసతో అందరిని కడుపుబ్బా నవ్విస్తూ.. స్టార్ కమెడియన్ గా ఉన్న బిత్తిరి సత్తిని టీఆర్ఎస్ లో చేర్చుకుని ఆయనకు ఎమ్యెల్యే సీటు కూడా ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడట. ఇప్పటివరకు ఎవరూ ఊహించని ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

CM KCR,Malkajgiri Mla Ticket,Trs Mla Ticket

రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి అనతికాలంలోనే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. v 6 తీన్మార్ ప్రోగ్రాంలో తనదైన యాంకరింగ్, స్పూఫ్స్ ను తెలంగాణ యాస మేళవించి కడుపుబ్బా నవ్విస్తాడు బిత్తిరి సత్తి. ఒక్క బిత్తిరి సత్తి ప్రోగ్రాం వల్లే v6 టీఆర్పీ రేటింగ్స్ అమాంతం పెరిగాయనేది అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంచితే ప్రస్తుతం మరో వార్త ఇప్పుడు మీడియాలో, తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

CM KCR,Malkajgiri Mla Ticket,Trs Mla Ticket

ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన టీఆర్ఎస్ 105మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన 14అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పుడు మీడియాకు చెందిన బిత్తిరి సత్తిని టీఆర్ ఎస్ తరపున బరిలోకి దింపేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. కేసీఆర్ పెండింగ్ లో పెట్టిన నియోజకవర్గాల్లో హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి కూడా ఉంది. ఈ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే కనకా రెడ్డికి ఈ సారి టీఆర్ ఎస్ టికెట్ ఇచ్చేది కష్టంగానే ఉంది. ఈ క్రమంలో బీసీ అభ్యర్థిగా బిత్తిరి సత్తిని నిలబెట్టేందుకు కేసీఆర్ డిసైడ్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

బిత్తిరిసత్తి ని పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీ తరపున ఎన్నికల ప్రచారం కి కూడా దింపొచ్చనే ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. సత్తికి టికెట్ ఇచ్చే విషయమై కొంతకాలం క్రితమే ఆయనకు సమాచారం అందిందని , ఆర్థికంగా అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ కేసీఆర్ నుంచి అందినట్టు దానికి అయన ఒకే చెప్పినట్టు సమాచారం.