KCR Confident for next election winning

తెలంగాణలో కాంగ్రెస్ జోరు ఒక పక్క పెరుగుతుంటే కేసీఆర్ తనదైన ఆలోచనలకి పదునుపెట్టారు..మైండ్ గేమ్ ఆడటంలో కేసీఆర్ చాలా సిద్దహస్తుడు..రేవంత్ టిడిపి నుంచీ కాంగ్రెస్ లోకి వెళ్ళిన తరువాత కాంగ్రెస్ ఫుల్ ఎనర్జీ తో ఉంది అంటూ వస్తున్నా వార్తలకి సరైన సమాధానం ఇచ్చారు కేసీఆర్..మేకు ఎక్కడున్నా మేకే పెద్దగా ఏమి లేదు అన్నట్టుగా కేసీఆర్ అది చాలా చిన్న విషయం ఎవరు పట్టించుకోవద్దు అని నేతలకి చెప్పారట.

గురువారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. దానికి ముందు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నూతన కార్యవర్గంతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారికి కేటాయించిన నియోజకవర్గ బాధ్యతలను వివరించారు.అనంతరం వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మరో ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. అంతకంటే మూడు నెలల ముందే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటిస్తాం. సిటింగ్‌లందరికీ టికెట్లు గ్యారంటీ’’ అని చెప్పారు. ఇక్కడే పార్టీ ఎమ్మెల్యేలు 90 మంది ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో మనం 96 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామని, 106 స్థానాల వరకూ గెలిచే చాన్స్‌ ఉందని, సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ అని ఎట్లా మనం గెలుపొందాలో నాకు తెలుసు అంటూ కేసీఆర్ మాట్లాడటం పార్టీ నేతల్లో జోష్ ని పెంచింది