నాయకులకు చుక్కలు చూపిస్తున్న సర్వే లెక్కలు !     2018-06-23   21:12:52  IST  Bhanu C

రాజకీయ పార్టీలకు ఇప్పుడు ప్రజానాడి తెలుసుకోవడం ఈజీ అయిపోయింది. ప్రజలు తమ గురించి ఏమనుకుంటున్నారు..? ఎక్కడ పార్టీ వీక్ గా ఉంది..? ఎక్కడ ఎక్కడ ఏ ఏ లోపాలు ఉన్నాయి..? అనే అంశాలను తెలుసుకునేందుకు సర్వేలు చేయిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది కూడా సర్వే రిపోర్ట్ ఆధారంగానే డిసైడ్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు ఇదే నాయకుల కొంప ముంచుతున్నాయి.

ఎవరి ఎవరి జాతకాలు ఎలా ఉండబోతున్నాయో సర్వేలు తేటతెల్లం చేసేస్తుండడంతో నాయకులూ అలకబూనుతున్నారు. మరికొందరు పక్క పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్నవారికి కూడా సర్వే రిపోర్ట్ ఆధారంగా టికెట్ ఇచ్చేది లేదని పార్టీ అధిష్టానాలు చెప్పేస్తుండడం నాయకుల అసంతృప్తికి కారణం అవుతోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లో ఇప్పటికే ఓ సర్వేపై కేసీఆర్ చర్చలు నిర్వహించి నెగిటివ్ టాక్ ఉన్న ప్రాంతాల నాయకులకు వార్నింగ్ లు ఇచ్చేశారు. గెలిచిన నాయకులూ వచ్చే ఏడాది కూడా గెలవాలి అంటే అభివృద్ధి పనులను పూర్తి చెయ్యాలని లేకపోతే టికెట్ కష్టమని చెప్పేసారు.