ఆంధ్రా పాలకులని కడిగేసిన కేసీఆర్..మరి నీ సంగతేంది కేసీఆర్...    2018-06-29   05:41:51  IST 

కేసీఆర్ తిక్క రాజకీయాలకి ఇదొక ఉదాహరణ..పెట్టిన చేతినే నరికేసే గొప్ప వ్యక్తి కేసీఆర్ అని మరో మారు నిరూపించుకున్నాడు…కేసీఆర్ ఎప్పుడు ఏపీ వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తూ ఆయన మంచి చేద్దలని దగ్గర ఉండి మరీ చూసుకునే ఏపీ పాలకులపై నిప్పులు చేరుగారు కేసీఆర్ ఒక పక్క దుర్గగుడికి వచ్చి రాజ లాంచనాలు అన్నీ అందుకుని మరీ దర్జాగా దొరారు తెలంగాణా వెళ్లి మరీ ఏపీ పాలకులని నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన ఘనత కేవలం కేసీఆర్ కే దక్కుతుంది..వివరాలలోకి వెళ్తే..

విజయవాడలో అమ్మవారి దర్సనం అయిన తరువాత హైదరాబాద్ వెళ్ళిపోయిన కేసీఆర్ తిరిగి ప్రగతి భవన్ లో రివ్యూ పెట్టుకున్నారు.అంతకు ముందే విజయవాడలో ఏపీ ప్రజలు పాలకులు ఆయనకీ సాదర స్వాగారం పలకడం అన్ని మర్యాదలు చేయడం అందరూ తిలకించారు ఆయన అనుభూతి కూడా పొందారు అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి మరీ కేసీఆర్ ఏపీ పై కస్సు మన్నారు.. మన విలువ మనకు తెలీకుండా ఆంధ్రా పాలకులు దుర్మార్గం చేశారంటూ కొత్త రాగం అందుకున్నారు.