కార్తీక మాసంలో శివునికి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే... కలిగే ఫలితాలు Devotional Bhakthi Songs Programs     2017-10-27   21:58:49  IST  Raghu V

kartika Masam Cow Ghee Deepam Importance

కార్తీక మాసం అంటే శివ కేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం. శివ, కేశవులు ఇద్దరినీ పూజించటం ఈ మాసం యొక్క విశిష్టత. కార్తీక మాసంలో స్నానాలు,దీపాలు వెలిగించటం,దానాలు చేయటం మరియు ఉపవాసాలు ఉండటం మొదలైనవి ఉంటాయి. వీటిని చేయటం వలన పాపాలు తొలగిపోవటమే కాకుండా పుణ్య ఫలం దక్కుతుంది. కార్తీక మాసంలో చేసే పూజలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈ మాసంలో స్త్రీ, పురుషులు ఇద్దరు తప్పనిసరిగా తెల్లవారు జామున తలస్నానం చేయాలి.

కార్తీక మాసంలో సాయంత్రం శివాలయంలో దీపం వెలిగించటం వలన కష్టాలు తొలగిపోయి అనంతమైన ఫలాలు లభిస్తాయి.శివాలయ గోపుర ద్వారం, శిఖరం, శివలింగ సన్నిధిలోగానీ దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించి పోతాయి. కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నేతితో దీపారాధన చేస్తే అత్యంత పుణ్యాత్ములవుతారు. మాసంలో ప్రతి రోజు ఆవునేతితో దీపారాధన చేస్తే జ్ఞానులై, మోక్షాన్ని పొందుతారని శివ పురాణంలో చెప్పారు.

ఈ విధంగా దీపారాధన చేయటం వలన పూర్వ జన్మ పాపాలు కూడా హరిస్తాయి. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనానంతరం ఆహారం స్వీకరించి, భగవంతుని ధ్యానంలో గడిపే వారు తప్పనిసరిగా శివ సాయుజ్యాన్ని పొందుతారు.