“కర్ణాటక” లో గెలుపు ఎవరిదో తేల్చి చెప్పిన “ఎగ్జిట్ పోల్స్”     2018-05-12   21:50:27  IST  Bhanu C

దేశంలో ఉన్న అన్ని పార్టీలు..ప్రజలు ఇప్పుడు ఎదుర్ చూస్తోంది కర్ణాటక ఎన్నికల ఫలితాల గురించే ఈ ఎన్నికలు కాంగ్రెస్ బీజేపిల దశా దిశ లని మార్చబోతున్నాయి..ఇక్కడ గనుకా కాంగ్రెస్ నెగ్గితే బీజేపి కి కోలుకోలేని ఎదురుదెబ్బే అంటున్నారు విశ్లేషకులు..ఇదిలాఉంటే ఒక వేళ బీజేపి గనుకా నెగ్గితే కాంగ్రెస్ కి దక్షినాది రాష్ట్రాలపై పట్టు సాధించడం ఎంతో కష్టం అవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం..అయితే పోలింగ్ సరళిని బట్టి ఓటర్ల మనోగతం ఆధారంగా అచేసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఎక్జిట్ పోల్స్ తమ అభిప్రాయాలని వెల్లడించాయి..

ముందుగా ఇండియా టుడే యాక్సిస్ సంస్థతో కలిసి చేసిన సర్వేలో కాంగ్రెస్ అధికారం చేపట్టటానికి కావాల్సిన 113 సీట్లని పూర్తిగా గెలుచుకోలేక పోయినా సరే 106 నుంచి 118 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందని గెలుచుకుంటుంనే విషయాన్ని స్పసాటం అని తెలిపింది. భారతీయ జనతా పార్టి 79 నుంచి 92 సీట్లను గెలుచుకుంటుందని..బిజెపి తెలుపడంతో బీజేపి నేతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి..ఇక జనతాదళ్(సెక్యులర్) 22 నుంచి ముప్పై స్థానాలు గెలుచుకుంటుంది అని, ఇతరులు ఒకటి నుంచి నాలుగు స్థానాలు గెలుస్తుందని తెలిపింది.