“కర్ణాటక” పరిస్థితే “ఏపీ” కి కూడా వస్తుందా..?     2018-05-18   01:24:54  IST  Bhanu C

దేశ రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో సంచలనం సృష్టించిన అంశం ఏదైనా ఉంది అంటే అది కేవలం కార్ణాటక రాజకీయమే..మొన్న జరిగిన ఎన్నికలు దేశం మొత్తం నరాలు తెగిపోయే ఉత్ఖంటగా చూసింది..కర్ణాటక గెలుపు ఓటముల ప్రభావం దక్షినాది రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం చూపనున్న నేపధ్యంలో కర్ణాటక రాజకీయాలు ఆసక్తిగా మారాయి..అయితే బీజేపి కి అక్కడ 104 స్థానాలు వచ్చాయి అయితే కాంగ్రెస్ కూటమికి మాత్రం 116 వచ్చాయి కానీ రంగు మార్చిన రాజకీయాలు కారణంగా గవర్నర్ వారం రోజులు సమయం ఇచ్చి మరీ బల నిరూపణ చేసుకోమని చెప్పారు.

అంటే ఇంకో 8 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే కానీ బీజేపి ప్రభుత్వం నిలబడదు ఇదిలాఉంటే మరో పక్క కేవలం 30 పై చీలుకు సీట్లు గెలుచుకున్న జేడీఎస్ నేత కుమారస్వామి కి కాంగ్రెస్ సీఎం ఫీటం సైతం ఇస్తామని ప్రకటించారు.. అయితే అనూహ్యంగా బీజేపీ చక్రం తిప్పడంతో అధికారం నిలబెట్టుకొంది ఈ విషయం ఇలా ఉంచితే..