కర్కాటక రాశి వారికి మార్చి నెల ప్రత్యేకం ఎందుకో తెలుసా?  

కర్కాటక రాశి వారికీ మార్చి నెలలో ఎలా ఉంటుందో తెలుసా? ఈ నెల మొత్తం కర్కాటక రాశి వారికి అదృష్ట నెలగా చెప్పవచ్చు. ఆర్ధిక పరంగా,కెరీర్ పరంగా,ఆరోగ్యపరంగా,కుటుంబ సంబంధాల విషయంలో ఈ నెలలో మంచి పురోగతిని సాధిస్తారు. ఈ నెలలో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక గత నెలలో వచ్చిన అడ్డంకులు అన్ని కూడా ఈ నెలలో తొలగిపోతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు అయితే వారికీ సానుకూలంగా ఈ నెల ఉంటుంది.

మీ కెరీర్ పరంగా చూసిన ఈ నెల మీకు బాగా కలిసివస్తుంది. ఆ నెలలో వచ్చే ఫలితాలను అందిపుచ్చుకోకపోతే ఇలాంటివి మీ జీవిత కాలంలో చాలా అరుదుగా అందుతాయి. మీరు వ్యాపారస్తులు అయితే ఈ నెల అంతా బంగారు కాలంగా చెప్పవచ్చు. వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటే ఈ నెల మంచిది. అలాగే మీ పోటీదారుల మీద విజయాన్ని సాధిస్తారు.

అంతేకాక కొత్త వ్యాపారం ప్రారంభించటానికి కూడా ఈ నెల బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారికి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు ఈ నెలలో పూర్తి అవుతాయి. అలాగే కొత్త ప్రాజెక్ట్ లను అందిపుచ్చుకుంటారు. అంతేకాక నూతన బాగస్వామ్య ప్రాజెక్ట్ లను ప్రారంభించటానికి కూడా మంచి సమయం అని చెప్పవచ్చు.