కర్కాటకరాశి వారు జీవిత భాగస్వామి అయితే జీవితం స్వర్గమా....నరకమా?     2018-04-30   03:42:43  IST  Raghu V

కర్కాటకరాశి వారు జీవిత భాగస్వామిగా ఉంటే వారి జీవితం ఎలా ఉంటుంది. అసలు కర్కాటకరాశి వారి ప్రవర్తన,ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్సు కలవారు. ఏ విషయాన్ని అయినా లోతుగా అలోచించి తొందరగా నిర్ణయం తీసుకొనే గొప్ప మనస్తత్వం కలిగిన వారు. వీరి ఆలోచన విధానం అనేది భగవంతుడు ఇచ్చిన వరంగా చెప్పవచ్చు. ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఈ రాశి వారు వెంటనే అర్ధం చేసుకుంటారు. అలాగే లోతుగా ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తారు.

వీరి మీద చంద్రుడి ప్రభావము ఎక్కువగా ఉండుట వలన నిర్ణయాలను తొందరగా తీసుకుంటారు. వీరు ఎదుటి వ్యక్తి యొక్క భావాలను వెంటనే పసిగట్టేస్తారు. కర్కాటక రాశి వారు ఎదుటి మనిషిలోని ఉద్దేశాన్ని పసిగట్టే లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికీ అద్భుతమైన పరిశీలన శక్తి ఉన్నా సరే వీరు చాలా సిగ్గరి అని చెప్పాలి.

కర్కాటక రాశి వారు ఎవరికైనా ఒకసారి మాట లేదా మనస్సు కానీ ఇస్తే దాని మీద నిలబడే ప్రయత్నం వందకు వంద శాతం చేస్తారు. అయితే ఏదైనా మాట ఇచ్చేటప్పుడు తొందరగా బయట పడకుండా అలోచించి మాత్రమే మాట ఇస్తారు. కర్కాటక రాశి వారు మాట మీద ఎలా నిలబడతారో అలాగే ఎదుటి వ్యక్తి కూడా అలానే ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ విషయంలో వారి భాగస్వామి కాస్త అర్ధం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఒకవేళ ఈ విషయంలో జీవిత భాగస్వామి అర్ధం చేసుకోకపోతే వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. కర్కాటక రాశి వారికీ ఎదుటి వ్యక్తి మీద మంచి అభిప్రాయం కలిగితే అలాగే ఉండిపోతారు. అదే చెడు అభిప్రాయం కలిగిన అలానే ఉండిపోతారు. వారు మంచివారని ఎంత చెప్పిన వినరు. వారి అభిప్రాయం మీదనే ఉండిపోతారు.