తాను ఓ "గే" అని ఒప్పేసుకున్న దర్శకుడు  

ప్రముఖ బాలివుడ్ దర్శకుడు కరణ్ జోహర్ కి ఇంతవరకు పెళ్ళి కాలేదు. అందరు హీరోయిన్లతో బాగా క్లోజ్ గా మూవ్ అవుతాడు కాని, ఎవరితోనూ ప్రేమాయణం నడపలేదు. కనీసం ఓ రూమార్ కూడా లేదు. అందుకే కరణ్ జోహర్ స్వలింగ సంపర్కుడని చాలా వార్తలు వచ్చేవి. కాని ఆ దర్శకుడు ఎప్పుడూ ఖచ్చతత్వంతో స్పందించలేదు. మొత్తానికి, ఇన్నాళ్ళకు ఒప్పేసుకున్నాడు, తాను ఓ గే అని.

భారతదేశంలో ఉన్న హోమోఫోబియా (స్వలింగ సంపర్కుల పట్ల అయిష్టత) గురించి మాట్లాడిన కరణ్ జోహార్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాను ఓ స్వలింగ సంపర్కుడినని ఇండైరెక్ట్ గా ఒప్పేసుకున్నాడు.

“నా సెక్సువల్ ఓరియెంటేషన్ ఏంటో అందరికి తెలుసు. నేను దాన్ని (గే అనే విషయాన్ని) అరుస్తూ బయటపెట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్పాలనుకున్నా, నేను చెప్పలేను. ఎందుకంటే నేను బ్రతుకుతున్న దేశంలో ఆ మాటలకి నన్ను జైలులో పెట్టినా పెడతారు. అందుకే నా గురించి అందరికి తెలిసిన విషయాన్ని కూడా నేను నా నోటితో బయటపెట్టలేను. ఈ హోమోఫోబియా అనేది హృదయానికి బాధను కలిగిస్తుంది” అంటూ చెప్పాల్సిన విషయం చెప్పకనే చెప్పాడు కరణ్.