భారత టెకీ “కూచీబోట్ల” హంతకుడికి...“యావజ్జీవ శిక్ష”     2018-05-05   06:58:43  IST  Bhanu C

విదేశీయులని అమెరికా నుంచీ వెళ్ళగొడుతాను మన దేశీయులకే ఉద్యోగాలు వచ్చేలా చేస్తాను అంటూ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నెలరోజుల లోగానే కూచీభొట్ల శ్రీనివాస్ హత్యకి గురయ్యిన సంఘటన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.. గతేడాది ఫిబ్రవరి 22న కాన్సస్‌ రాష్ట్రంలోని ఓలేత్ నగరంలో ఓ బార్‌లో ఉన్న తెలుగు టెకీలు శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాడసానిపై ఆడమ్ పురింటన్ కాల్పులు జరిపాడు. ‘మా దేశం నుంచి వెళ్లిపోండి’ అంటూ మొదట హెచ్చరించి బార్ నుంచి వెళ్లిపోయాడు పురింటన్..అయితే

కొద్ది సేపటి తర్వాత మళ్లీ వచ్చి వారిద్దరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయాడు..ఈ క్రమంలోనే శ్రీనివాస్ కూచిభొట్ల మరణించగా.. అలోక్‌ తీవ్రంగా గాయపడ్డాడు దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో ఒక్క సారిగా ఉలిక్కిపడిన ట్రంప్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ తమ ప్రజలకి ఇలాంటి శాంతి సందేశం పంపాడు..దాంతో విచారణ చేపట్టిన పోలీసులు కోర్టుకు ఆధారాలు సమర్పించిన తరువాత అమెరికా ఫెడరల్ కోర్టు తుది తీర్పును వెల్లడించింది.