క‌న్నా వైసీపీ ఎంట్రీ బ్రేక్‌... బెదిరింపులు ప‌నిచేశాయా..!     2018-04-26   02:31:53  IST  Bhanu C

గ‌త రెండు మూడు రోజులుగా ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన పేరు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌. ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో ప్ర‌ముఖంగా ఆయ‌న పేరు వినిపించింది. ఆయ‌న త్వ‌ర‌లోనే ఏపీ బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్ట‌బోతున్నార‌ని, ఆయ‌న కాపు సామాజిక వ‌ర్గం కావ‌డంతో అది బాగా ప‌నిచేసింద‌ని ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే, అనూహ్యంగా ఆయ‌నకు బీజేపీలో సీనియార్టీ లేక‌పోవ‌డంతో ఆయ‌న‌ను బీజేపీ అధిష్టానం ప‌క్క‌న పెట్టింది. దీంతో అప్ప‌టికే తీవ్ర‌మైన ఆశ‌లు పెట్టుకున్న క‌న్నా.. ఒక్క‌సారిగా డీలా ప‌డిపోయారు. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిపోయిన విష‌యం కూడా భారీ ఎత్తున హ‌ల్‌చ‌ల్ చేసింది. దీనిని రాష్ట్ర బీజేపీ నేత‌లు పెద్ద సీరియ‌స్‌గా తీసుకోలేదు. అయితే, కేంద్రంలోని బీజేపీ అధిష్టానానికి ఈ విష‌యం తెలిసి.. చాలా సీరియ‌స్ అయింది.

వెంట‌నే లైన్‌లోకి వ‌చ్చిన బీజేపీ అధిష్టానం పెద్ద‌లు క‌న్నాతో చ‌ర్చించారు. పార్టీ మారొద్ద‌ని ఫ్యూచ‌ర్ చూపిస్తామ‌ని అన్నారు. వాస్త‌వానికి.. క‌న్నా.. వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిపోవ‌డం త‌న‌కు పెద‌కూర‌పాడు అసెంబ్లీ త‌న‌కు త‌న స‌న్నిహితుడు అయిన తేళ్ల వెంక‌టేశ్ యాద‌వ్‌కు చీరాల సీటు కూడా రిజ‌ర్వ్ చేసుకున్నారు. పార్టీలో చేరేందుకు బుధ‌వారం ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అయితే, ఈ విష‌యం తెలిసిన బీజేపీ సీనియ‌ర్ అయిన క‌న్నాను పోగొట్టు కోవ‌డం ఇష్టం లేక ఒక‌ప‌క్క‌, క‌న్నా వెళ్లిపోతే.. కాపులు పార్టీకి దూర‌మ‌వుతార‌ని మ‌రోప‌క్క‌… బాగా ఆలోచించిన మీద‌ట క‌న్నాను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు స‌మాచారం. బుధ‌వారం తెల్ల‌వారుతూనే క‌న్నాకు ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్ వ‌చ్చింద‌ట‌.