ఏపీలో బీజేపీ నిద్ర లేచిందా.... ఇట్స్ టూ లేట్‌..!     2018-06-13   01:19:09  IST  Bhanu C

అంద‌రూ అనుకున్న‌ట్లుగానే.. ఈ రెండు కార్య‌క్ర‌మాల త‌ర్వాత నిన్న ఢిల్లీకి వెళ్లి మోడీని క‌న్నా మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌ల‌వ‌డం గ‌మ‌నార్హం. అయితే ఏపీలో బీజేపీ త్రిముఖ వ్యూహం అమ‌లుపై ఇట్స్ టూ లేట్‌.. అనే టాక్ వినిపిస్తోంది. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌చందంగా కార్యాచ‌ర‌ణ ఉంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లోనే అంత‌ర్గ‌తంగా చ‌ర్చ‌మొద‌లైన‌ట్లు స‌మాచారం. నిజానికి కేంద్రం నుంచి, ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కు రాగానే అమ‌లు చేయాల్సిన వ్యూహాన్ని జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగాక చేయ‌డ‌మేమిట‌నే ప్రశ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

ఏప్రిల్ 6న‌ పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిసిన రెండు నెల‌ల త‌ర్వాత ఏపీలో పార్టీ కార్యాచ‌ర‌ణ మొద‌లుపెట్ట‌డంపై ప‌లువురు నాయ‌కులు పెద‌వి విరుస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ రెండు నెల‌ల్లోనే బీజేపీని టార్గెట్ చేస్తూ చంద్ర‌బాబు నిరంత‌ర కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు వెళ్ల‌డం..ఏపీకి బీజేపీ న‌మ్మ‌క ద్రోహం చేసింద‌నీ, బీజేపీ-వైసీపీలు కుట్ర‌రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నాయ‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీలోకి ఇత‌ర పార్టీల నుంచి వల‌స‌లు కోరుకోవ‌డం అత్యాశే అవుతుంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టిన గ‌తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి ప‌డుతుంద‌ని ఇప్ప‌టికే చంద్ర‌బాబు అంటున్నారు. అలాగే.. బీజేపీ-వైసీపీ అంట‌కాగ‌డంపై కూడా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే ఢిల్లీలో మోడీ,ఇ త‌ర నేత‌ల‌ను క‌లిసి వ‌చ్చిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కార్యాచ‌ర‌ణ‌లో ఎలాంటి మార్పులు ఉంటాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.