భారతీయుల కల నెరవేరనుంది... అధ్యక్ష ఎన్నికల్లో.     2018-06-27   06:38:29  IST  Raghu V

భారత సంతతికి చెందినవారు ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది…అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాలని అనుకున్న ఎంతో మంది భారత సంతతి వ్యక్తుల కల నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉంది..ఎంతో మంది భారత ఎన్నారైలు ఈ తరుణం కోసం వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు.. 2020 ఎన్నికల్లో..ఈ కోరిక తీరే అవకాశం ఉందని అంటున్నారు..ఏంటి నమ్మలేక పోతున్నారా..?

భారత సంతతికి చెందిన అమెరికా సెనేటర్‌ కమలా హారిష్‌ వచ్చే ఎన్నికల్లో తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని చెప్పీ చెప్పక ఆసక్తిని రేకెత్తించారు..ఆమె పోటీ చేయవచ్చనే అంచనాలు భారీగా ఉన్నాయి…53 ఏళ్ల కమల..అమెరికా సెనేట్‌కు ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి. ఆమె డెమొక్రటిక్‌ పార్టీ నాయకురాలు..అయితే 2020లో అధ్యక్ష పదవి పోటీ చసే అవకాశాన్ని ఖండిస్తున్నారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు లేదని అని ఆమె జవాబు చెప్పారు…దాంతో తానూ రేసులో ఉన్నాను అని చెప్పకనే చెప్పారు.