ఎన్టీఆర్‌ను ఫుల్‌గా వాడేస్తున్నాడుగా..!     2018-06-13   04:56:47  IST  Raghu V

తమ్ముడిని ఎన్ని రకాుగా వాడేసుకోవాలో అన్ని రకాలుగా వాడేసుకుంటూ కళ్యాణ్‌ రామ్‌ లాభం పొందుతున్నాడు. గత సంవత్సరం కళ్యాణ్‌ రామ్‌ బ్యానర్‌లో ఎన్టీఆర్‌ చిత్రం ‘జైలవకుశ’ తెరకెక్కింది. ఆ చిత్రంతో కళ్యాణ్‌ రామ్‌కు ఏకంగా 80 కోట్ల మేరకు లాభం దక్కిందని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు పారితోషికం ముట్టజెప్పింది పెద్దగా ఏమీ లేదు. అందుకే ఇంత భారీగా నిర్మాతగా కళ్యాణ్‌ రామ్‌ పొందాడు. ఇక తన ప్రతి సినిమాకు కూడా కళ్యాణ్‌ రామ్‌ తమ్ముడు ఎన్టీఆర్‌తో ప్రమోషన్‌ చేయించుకుంటున్నాడు. దాంతో కళ్యాణ్‌ రామ్‌ సినిమాలు మంచి రేటుకు అమ్ముడు పోతున్నాయి.

గత సంవత్సరంలో ఎన్టీఆర్‌ బిగ్‌బాస్‌ చేస్తున్న సమయంలో ఆ షోకు సంబంధించిన యాడ్‌ స్లాట్‌ కూడా దక్కించుకున్నాడు అని, దాంట్లో ఇతర కంపెనీల యాడ్స్‌ను వేయించాడు, అలా కూడా కళ్యాణ్‌ రామ్‌కు ఆధాయం మిగిలింది. ఇలా అన్ని రకాలుగా తమ్ముడు ఎన్టీఆర్‌ను వాడేసుకుంటున్న కళ్యాణ్‌ రామ్‌ మంచి మాటతోనే తమ్ముడిని మాయ చేస్తున్నాడు అంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న మూవీ ఒక ఏరియా హక్కులు కళ్యాణ్‌ రామ్‌కు దక్కాయి. ఆ తర్వాత జక్కన్న మూవీ రైట్స్‌ కూడా కళ్యాణ్‌ రామ్‌ దక్కించుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.