చైతూతో కళ్యాణ్‌ రామ్‌ చిత్రం!     2015-02-04   23:37:17  IST  Raghu V

Kalyan Ram To Produce a Movie With Naga Chaitanya

‘పటాస్‌’ చిత్రంతో హీరోగా నిర్మాతగా సూపర్‌ డూపర్‌ హిట్‌ను అందుకున్న కళ్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం రవితేజతో ‘కిక్‌`2’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా సినిమాలు చేస్తూనే ఇతర హీరోలతో సినిమాలు నిర్మిస్తానంటూ ఇటీవలే ప్రకటించాడు. ఈ నందమూరి నిర్మాత త్వరలో అక్కినేని నాగచైతన్యతో ఒక సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అందుకోసం ఒక స్టోరీ లైన్‌ కూడా సిద్దం అయ్యింది.

కళ్యాణ్‌ రామ్‌ ఇప్పటికే నాగచైతన్యతో ఒక కథ చెప్పినట్లుగా తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. కాని అప్పటికే నాగచైతన్య ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టారు. తాజాగా ఇప్పుడు మరోసారి ఆ సినిమా గురించి నాగచైతన్యతో కళ్యాణ్‌ రామ్‌ సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబినేషన్‌లో చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మరో వైపు నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తన బాబాయి బాలయ్యతో కూడా ఒక సినిమా నిర్మించాలని కోరుకుంటున్నాడు.