కోట్లలో నష్టాలు ... కళ్యాణ్ రామ్ ''సినిమా కష్టాలు''     2018-06-10   01:04:44  IST  Raghu V

నటుడిగా… నిర్మాతగా రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న కళ్యాణ్ రామ్ ప్రయాణం సాఫీగా సాగడంలేదు. కథనానికి ప్రాధాన్యత ఇస్తూ కోట్లరూపాయలు పెట్టుబడిగా పెట్టి ఆయన నిర్మిస్తున్న సినిమాలు బాక్సపీస్ వద్ద బోర్లాపడుతున్నాయి. ఆయన సినిమాలు నిర్మిస్తూ చేతులు కాల్చుకోవడం పరిపాటిగా మారిపోయింది. పోనీ హీరోగా ఏమైనా నిలదొక్కుకుంటున్నాడా అంటే అక్కడ కూడా అదే సీన్ రివర్స్ అవుతోంది. ఈవారం విడుదల కాబోతున్న తన లేటెస్ట్ మూవీ ‘నా నువ్వే’ సినిమాను ప్రమోట్ చేస్తూ కళ్యాణ్ రామ్ తాను తీసిన సినిమాల వల్ల వచ్చిన నష్టాల పై స్పందించాడు.

తాను సినిమాలు తీసి కోట్లు పోగొట్టుకున్నా తాను ఎప్పుడూ బాథపడలేదనీ దానికి కారణం తాను జూదం ఆడి డబ్బు పోగొట్టుకోలేదు అని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. సినిమాలు తీయడం అందులో విజయం సాధించడం అన్నది ఎవరికీ అంతుపట్టని సీక్రెట్ అని అంటూ ఏ సినిమా హిట్ అవుతుందో మరే సినిమా ఫ్లాప్ అవుతుందో ఎవరికీ తెలియని విషయం అని అంటూ కేవలం అదృష్టం వలన మాత్రమే సినిమాలలో విజయాలు ఉంటాయి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు.