క‌ళ్ళ కొన‌ల వ‌ద్ద పుసి ఎందుకు ఏర్పడుతుందో తెలుసా..? అది మంచిదేనా.?    2018-06-27   01:11:36  IST  Lakshmi P

నిద్ర‌పోయి లేచిన త‌ర్వాత‌.. లేదంటే జ‌లుబు, పడిశం వంటివి వ‌చ్చిన‌ప్పుడు కళ్ల కొన‌ల ద‌గ్గ‌ర పుసి క‌డుతుందని తెలుసు క‌దా.. అది ఒక్కొక్క‌రిలో ఒక్కోలా ఉంటుంది. కొంద‌రిలో పుసి గ‌ట్టిగా ఏర్ప‌డితే మ‌రికొంద‌రిలో ద్రవంలా ఉంటుంది. ఇంకా కొంద‌రిలో జిగ‌రు జిగురుగా మారుతుంది. అయితే ఎలా ఉన్నా పుసి ఏవిధంగా త‌యార‌వుతుందో, అస‌లు ఎందుకు వ‌స్తుందో చాలా మందికి తెలియదు. క‌ళ్ల మ‌ధ్య‌లో ఉండే న‌ల్ల‌ని భాగం మ్యూక‌స్, ఆయిల్ వంటి ప‌దార్థాల‌తో త‌యారైన ఓ పొర‌ను క‌లిగి ఉంటుంది. దీన్నే ‘టియ‌ర్ ఫిలిం’ అంటారు. ఇది ఎల్ల‌ప్పుడూ క‌ళ్ల‌లోకి ఆయిల్ వంటి ద్రవాల‌ను విస‌ర్జిస్తుంటుంది. దీని వ‌ల్ల..

కంటి రెప్ప‌లు ఆర్పిన‌పుడ‌ల్లా ఆ ఆయిల్ వంటి ద్ర‌వాలు కంటి అంత‌టికీ విస్త‌రించి కంటికి ర‌క్ష‌ణ క‌వ‌చంలా నిలుస్తాయి. దీంతో క‌ళ్లు సుర‌క్షితంగా ఉంటాయి. అయితే ఆ ద్ర‌వాలు కళ్ల‌లో విస్త‌రించిన‌పుడ‌ల్లా క‌ళ్ల‌లో ఉండే దుమ్ము, ధూళి వంటివ‌న్నీ దూరంగా నెట్టివేయ‌బ‌డ‌తాయి. ఈ క్ర‌మంలో అలా పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మ్యూక‌స్‌, డెడ్ స్కిన్ సెల్స్‌, ఆయిల్‌, బాక్టీరియా అంతా క‌లిసి పుసిగా ఏర్ప‌డి క‌ళ్ల కొన‌ల వ‌ద్ద‌కు చేరుతాయి. అయితే ఈ పుసి ప‌గ‌టి పూట కూడా ఏర్ప‌డుతుంది. కానీ అది అంత‌గా మ‌న‌కు క‌నిపించ‌దు. రాత్రి పూట పుసిని ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. మ‌రీ ఇక ఉద‌య‌మైతే ఆ పుసి కంటి కొన‌ల వ‌ద్ద ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. రాత్రి పూట ఎక్కువ సేపు క‌ళ్లు మూసే ఉంటాం కాబ‌ట్టి పుసి అంతా క‌ళ్ల కొన‌ల వ‌ద్ద‌కు చేరి ఎక్కువ‌గా పేరుకుపోతుంది. దీంతో ఉద‌యాన్నే క‌ళ్ల వ‌ద్ద మ‌న‌కు పుసి ఎక్కువ‌గా కనిపిస్తుంది.