పొలంలో కాజల్ ఫోటో పెట్టడానికి అసలు కారణం అదే అంట.!    2018-07-05   02:35:52  IST  Raghu V

మన దేశంలో చాలా వరకు హిందువులే కాదు, పలు ఇతర వర్గాలకు చెందిన వారు కూడా దృష్టి ఉందని నమ్ముతారు. దృష్టి అంటే.. అదేనండీ.. మన వాళ్లు దిష్టి అంటారు కదా. అదే. దాన్నుంచి తప్పించుకునేందుకు అందరూ రక రకాల పద్ధతులు పాటిస్తారు. ఉప్పు, చెప్పులు, చీపురు వంటి వాటిని ఉపయోగించి దిష్టి తీస్తారు. కొందరు తాయెత్తులు కట్టుకుంటారు. ఇక కొందరు ఇండ్లలో, ఆఫీసుల్లో, షాపుల్లో దిష్టిబొమ్మలు వేలాడదీస్తారు. వాహనాలకైతే జీడిగింజలు, నిమ్మకాయలు, నల్లదారం కలిపి కడతారు. నేటి తరుణంలో చాలా మంది తమకు దిష్టి తగలకుండా ఉండేందుకు గాను ఎడమ కాలికి నల్లదారం కూడా కట్టుకుంటున్నారు. అయితే ఇవన్నీ దిష్టిని తగ్గించుకునేందుకు మనకు తెలిసిన పలు విధానాలే.

కానీ ఓ రైతు మాత్రం పొలానికి దిష్టి తగలకుండా ఏకంగా హీరోయిన్ ఫోటో ని పెట్టాడు. హీరోయిన్ ఫోటో అంటే మనం సాదరంగా పోస్టర్ గానో లేక వాల్ పేపర్ గా పెట్టుకుంటాము. అతనేమో దిష్టి బొమ్మ లాగ పెట్టాడు. ఈ ఘటన . సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండ‌లం గొల్ల‌ప‌ల్లి లో జరిగింది.

బిక్కుమియా అనే రైతు ప్రతి ఏటా 3 ఎక‌రాల్లో కూరగాయలు పండిస్తున్నాడు. ప్రతిసారి పంట బాగా పండడం కోత సమయానికి ఏదో ఒక తెగుళ్లు రావడం. దాంతో దిగుబడి తగ్గిపోవడం. ప్రతి ఏడూ ఇలాగే జరుగుతోంది. దీంతో బిక్కుమియా తీవ్రంగా నష్టపోయాడు. పంట బాగా పండుతోంది. సరిగ్గా చేతికొచ్చే సమయానికే ఎందుకిలా అవుతోందని ఆలోచించాడు. కొందరిని ఆరా తీస్తే అందుకు నరదిష్టే కారణమని చెప్పారట. అందుకే ఇలా కాజల్‌ను తీసుకొచ్చి సెట్ చేశారు.