శ్రీయ లాగే ప్రేమించిన వాడిని రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్న టాప్ హీరోయిన్.! ఇంతకీ ఆమె ఎవరు?     2018-06-28   04:12:15  IST  Raghu V

మనం తెలుగు వాళ్ళం. సినిమాలు మన లైఫ్ లో ఒక భాగం అంటే అతిశయోక్తి కాదు. వినోదానికి మనం అంత ప్రాధాన్యత ఇస్తుంటాము. ప్రస్తుతం మన తెలుగులో టాప్ హీరోయిన్ ఎవరు అంటే.? అధిక శాతం మందికి గుర్తొచ్చే హీరోయిన్ కాజల్. పది సంవత్సరాల నుండి తెలుగులో సక్సెఫుల్ కెరీర్ తో దూసుకుపోతుంది ఈ సుందరి. అయితే దక్షిణాదిలో అగ్రనాయకిగా వెలుగొందుతున్న ఈ బ్యూటీకిప్పుడు అవకాశాలు తగ్గు ముఖం పట్టాయనే చెప్పాలి. ముఖ్యంగా తమిళంలో విజయ్, అజిత్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించిన కాజల్‌అగర్వాల్‌కు ఇప్పుడు ప్యారీస్‌ ప్యారీస్‌ చిత్రం మాత్రమే చేతిలో ఉంది. టాలీవుడ్‌లోనూ ప్రముఖ హీరోల చిత్రాలేవీ లేవు.

కాజల్‌ ఇప్పుడు యువ హీరోలతో నటించడానికే ఆసక్తి చూపుతుదనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకూ స్టార్‌ హీరోలతో జత కట్టిన మీరు ఇప్పుడు కుర్ర హీరోలతో నటించడానికి ఆసక్తి చూపడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు ఈ అమ్మడు ఏం చెప్పిందో చూద్దాం. నేను యువ హీరోలతో నటించడాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు గానీ, నిజానికి నేనెప్పుడూ నాతో జత కట్టే హీరో ఎవరన్న విషయం గురించి పట్టించుకోలేదు. నాకు ఇచ్చిన పాత్ర ఎలాంటిదన్న దానిపైనే దృష్టి సారిస్తాను. హీరోలెవరైనా నటించవచ్చు. అయితే నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి. ఆ పాత్రను నేను బాగా చేయాలి అనే కోరుకుంటాను.