Kajal Agarwal manager arrested in Tollywood drugs case

అదేదో అంటారు చూడండి … బట్టర్ ఫ్లై రియాక్షన్, చైన్ రియాక్షన్ అని. ఒక దాన్ని కదిలిస్తే అది మరొకదాన్ని కదిలిస్తుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే, పేకమెడ లాగా, ఒక కార్డుని కదిలిస్తే, అది మరో కార్డుని కదిలిస్తుంది. ఆరకంగా మొత్తం మేడ కూలిపోతుంది. అదే జరుగుతోంది టాలివుడ్ డ్రగ్స్ కేసులో. ఒకరిని కూపీ లాగితే, అధికారులకి తెలియని రెండు మూడు కొత్త పేర్లు వినబడుతున్నాయి. ఆ రకంగా, ఒకరి తరువాత ఒకరు, డ్రగ్స్ దొంగలు అంతా బయటపడిపోతున్నారు. తాజాగా ఓ పెద్ద చేప వలలో పడింది. ఆ చేప పేరు రాన్ సన్ జోసెఫ్, అలియాస్ రోని. ఇతనేవరు, పేరు కూడా మొదటిసారి వింటున్నాం అనుకుంటున్నారా ? ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రీటీలకంటే ఇతగాడే కీలకం కానున్నాడు. ఎందుకంటే ఇతను సెలబ్రిటి మేనేజర్ కాబట్టి.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మరియు మేఘా ఆకాష్ (నితిన్ సినిమా లై హీరోయిన్) లకి మేనేజర్ గా వ్యవహరిస్తున్న రోని, ఇంతకుముందు రాశీ ఖాన్న, లావణ్య త్రిపాఠిలను మేనేజ్ చేసేవాడు. ఇక ఇతగాడు చేసిన పని ఏంటి అంటే డ్రగ్స్ సరఫరా. బంజారాహిల్స్ లోని రోని ఇంట్లో దాడులు నిర్వహించారు సిట్ అధికారులు. అతడి ఇంట్లో కిలోల కొద్ది మరిజుఅనా దొరికింది. చాలామంది సెలబ్రీటీలకు ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని టాక్. ఇలా అనుమానం రాగానే అలా దాడులు చేసారు, పట్టేసుకున్నారు.

ఇతడిని విచారించడం ద్వారా చాలా పెద్ద తిమింగలాలని పట్టుకోవచ్చు అని ఆశిస్తున్నారు సిట్ అధికారులు. ఎందుకంటే సెలబ్రిటి మేనేజర్స్ కి ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద సీక్రెట్లు తెలిసిపోతుంటాయి. తెర వెనుక సినిమాతారలు ఎలా ఉంటారో వారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. దాంతో మరికొంతమంది పేర్లు, ముఖ్యంగా హీరోయిన్ల పేర్లు బయటకి రావచ్చు అని అంచనా. రోని అరెస్టు విషయంలో కాజల్ అయితే ఇంతవరకు తన స్పందన తెలుపలేదు. కాజల్ – రోనిల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉండటంతో, రోని విషయం కాజల్ కి ముందే తెలుసు ఏమో, అయినా బయటకి చెప్పలేదు అంటూ గుసగుసలాడుకుంటున్నారు ఫిలింనగర్ ప్రజలు. ఇక కాజల్ కి ఈ డ్రాగ్ మాఫియాలో ఎలాంటి లింక్ ఉండకూడదు అంటూ ఆశిస్తున్నారు ఆమె అభిమానులు.