అదృష్టం అంటే కాజల్‌దే..!     2018-06-06   00:21:44  IST  Raghu V

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తేజ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ‘లక్ష్మి కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా కాజల్‌ పరిచయం అయ్యింది. మొదట ఒకటి రెండు సినిమాలు యావరేజ్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఈమె నటించిన ‘చందమామ’ చిత్రం ఒక అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. చందమామలో కాజల్‌ను దర్శకుడు కృష్ణవంశీ అదిరిపోయేలా చూపించి, మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రను కట్టబెట్టాడు. దాంతో ఆమె కెరీర్‌ టర్న్‌ అయ్యింది. హీరోయిన్‌గా నిలదొక్కుకున్న సమయంలోనే ఈ అమ్మడికి రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ చిత్రంలో రామ్‌ చరణ్‌ సరసన నటించే అవకాశం రావడం, ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది.

‘మగధీర’ చిత్రం తర్వాత దాదాపు దశాబ్ద కాలం పాటు ఆమె వెనుదిరిగి చూసింది లేదు. చేసిన ప్రతి సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకోవడంతో స్టార్‌ హీరోలు ఆమెను కోరుకున్నారు. పది సంవత్సరాల పాటు వరుసగా స్టార్‌ హీరోలతో మాత్రమే నటించి రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో అతి కొద్ది మంది మాత్రమే అందరు స్టార్‌ హీరోలతో నటించారు. అందులో కాజల్‌ ఒకరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఎంతటి హీరోయిన్‌కు అయినా కూడా కొంత కాలం తర్వాత ఛాన్స్‌ లేక కష్టాలు తప్పవు. ముఖ్యంగా ఈమద్య కాలంలో వస్తున్న హీరోయిన్స్‌ రెండు మూడు సంవత్సరాలు, మా అంటే అయిదు సంవత్సరాల కంటే ఎక్కువగా హీరోయిన్‌గా కొనసాగలేక పోతున్నారు. కాని కాజల్‌ మాత్రం అదృష్టం కొద్ది అవకాశాలను దక్కించుకుంటూనే ఉంది.