Kajal Agarwal is pregnant?

కాజల్ అగర్వాల్ కెరీర్ మొదలుపెట్టి దశాబ్దకాలం దాటింది. కాని ఆమె మీద అక్కడ ఎఫైర్, అతనితో ఎఫైర్ అంటూ పెద్దగా రూమర్లు వినబడవు. ఓ ఇద్దరి అగ్రహీరోలతో ఈమెని లింక్ అప్ చేస్తూ కొన్ని గాలికబుర్లు వచ్చినా, అవి మీడియా దాకా రాలేదు. ఎందుకంటే అందులో నిజం లేదు కాబట్టి. అలాంటి కాజల్ గురించి కొత్తగా ఓ పెద్ద రూమర్ పుట్టుకొచ్చింది. కాజల్ గర్భవతి అంట.

సోషల్ మీడియాలో పుట్టిన ఈ రూమర్ నిన్న చాలాసేపు హల్ చల్ చేసింది. కాజల్ గర్భవతి అని, ముంబాయికి చెందిన ఓ బిజినెస్ మెన్ తో ప్రేమలో ఉన్న కాజల్, అతని ద్వారా ప్రెగ్నెంట్ అయ్యందని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాసుకుంటూ పోయారు.

ఇదంతా విన్న కాజల్ ఫక్కుమని నవ్వేసిందట. ఏదైనా సీరియస్ రూమర్ ఉంటే స్పందించాలి కాని ఇలాంటి సిల్లి రూమార్స్ ని ఎందుకు పట్టించుకోవడం అంటూ కామ్ గా ఉండిపోయింది. వాస్తవానికి అయితే కాజల్ షూటింగ్ లో బిజీబిజీగా ఉంది. ఈ టైమ్ లో గర్భం దాల్చి కెరీర్ లో ఎందుకు అవకతవకలు తెచ్చుకుంటుంది కాజల్ ?

రానా హీరోగా వస్తున నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ పూర్తయ్యింది. అజిత్ కుమార్ సరసన ఓ సినిమా, విజయ్ సరసన ఓ సినిమా, ఇలా గత ఏడాది మహేష్ – పవన్ తో సినిమాలు చేసినట్టు తమిళంలో కూడా ఇద్దరు టాప్ హీరోలతో సినిమాలు చేస్తోంది కాజల్.