ఫేస్‌‘బుక్‌’ అయిన ‘కాలా’     2018-06-06   23:42:23  IST  Raghu V

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా నటించిన ‘కాలా’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు రంజిత్‌ పా దర్శకత్వం వహించాడు. కబాలి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఆకట్టుకుంటుందని అంతా అనుకుంటున్నారు. ‘కబాలి’ చిత్రంతో నిరాశ పర్చిన దర్శకుడు రంజిత్‌ పా ఈసారి ఖచ్చితంగా సూపర్‌ స్టార్‌ స్థాయిలో సినిమాను తీస్తాడంటూ నమ్మకంగా ఉన్నారు. భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తున్నారు. తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.

ఓవర్సీస్‌ మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా దుమ్ము దుమ్ముగా విడుదల చేసి ఈ చిత్రంతో భారీ లాభాలను దక్కించుకోవాలనే పట్టుదలతో నిర్మాత ధనుష్‌ ఉన్నాడు. సినిమా మినిమం సక్సెస్‌ అయినా కూడా రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే సినిమా పైరసీ బయటకు రాకుండా నిర్మాత ధనుష్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంతగా ప్రయత్నించినా కూడా ‘కాలా’ చిత్రం అప్పుడే పైరసీ వచ్చేసింది. ఇంకా విడుదల కాకుండానే పైరసీ ఎలా అనుకుంటున్నారా..