తెలుగులో ‘కాలా’ పరిస్థితి చెబితే నోరెళ్లబెడతారు     2018-06-08   23:56:03  IST  Raghu V

సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులు అన్ని కోసేసుకుంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తమిళం స్థాయిలో తెలుగులో కూడా రజినీకాంత్‌ గతంలో వసూళ్లను సాధించాడు. తెలుగులో రజినీకాంత్‌ సినిమాలు డైరెక్ట్‌ సినిమాల కంటే కూడా అధికంగా వసూళ్లను సాధించాయి. ఇంతటి ఘన విజయాలు అందుకున్న రజినీకాంత్‌ గత కొంత కాలంగా తీవ్రంగా నిరాశ పర్చుతూ వస్తున్నాడు. ఈయన చేసిన, చేస్తున్న సినిమాలు ఏ ఒక్కటి కూడా తెలుగు ప్రేక్షకులను అలరించలేక పోతున్నాయి. లింగ సినిమా నుండి ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలు అన్ని కూడా తెలుగులో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చింది.

ఇటీవలే ‘కబాలి’ చిత్రంతో తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలనుకున్న రజినీకాంత్‌ బొక్క బోర్లా పడ్డాడు. ఆ సినిమాపై ఉన్న అంచనాలతో డైరెక్ట్‌ సినిమా కంటే ఎక్కువగా పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. కాని పరిస్థితి తారు మారు అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోని ఆ సినిమా డిజాస్టర్‌ కా బాప్‌ గా నిలిచింది. అంత జరిగినా కూడా అదే చిత్ర దర్శకుడితో రజినీకాంత్‌ సినిమా చేశాడు. రజినీకాంత్‌ అంతగా నమ్మాడు కనుక ‘కాలా’ సినిమా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం అందరిలో కలిగింది. అందుకే దిల్‌రాజు వంటి ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు.