Kaadhali movie review

చిత్రం : కాదలి

బ్యానర్ : అనగనగా ఫిలిం కంపెనీ

దర్శకత్వం : పట్టాభి ఆర్ చిలుకూరి

నిర్మాత : పట్టాభి ఆర్ చిలుకూరి

సంగీతం : ప్రసన్న ప్రవీన్ శ్యామ్

విడుదల తేది : జూన్ 9, 2017

నటీనటులు : హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, పూజ దోషి తదితరులు

కథలోకి వెళితే :

బాంధవి (పూజ దోషి) ఓ మధ్యతరగతి అమ్మాయి. ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఈ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఉంటాయి. అప్పులున్న ఫ్యామిలితో సంబంధం ఇష్టం లేక బాంధవికి పెళ్ళి కుదరదు. ఈ జన్మకి తనకి పెళ్ళికి అవుతుందా అనే నిరాశలో ఉన్న బాంధవి, తానే ఓ అబ్బాయిని డేట్ చేసి పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అవుతుంది.

ఇలాంటి సమయంలో బాంధవికి ఇద్దరు అబ్బాయిలు కార్తిక్ (హరీష్ కళ్యాణ్), క్రాంతి (సాయి రోనక్) పరిచయమవుతారు. ఇద్దరితో ఫ్రెండ్ షిప్ చేసే బాంధవి, ఇద్దరిలో ఎవరితో తను జీవితంలో ముందుకెళ్ళాలో నిర్ణయించుకోవంలో అయోమయానికి లోనవుతుంది. చివరకి బాంధవి ఇద్దరిలో తన ఓటు ఎవరికి వేసిందో తెర మీద చూడండి.

నటీనటుల నటన :

పూజ కే దోషి అస్సలు ఆకట్టుకోలేదు. అమ్మాయి తెలుగులో డైలాగులు కూడా చెప్పకుండా చాలా సీన్లు లాగేసింది. ఎవరు వినని గొంతుతో డబ్బింగ్ చెప్పించినా ఎంతోకొంత నేచురాలిటి కనిపించేదేమో. మనం చాలాసార్లు విన్న గొంతే కావడంతో తన ఇంటర్యాక్షన్స్ పెద్దగా ఎక్కవు.

తనిళనటుడు హరీష్ కళ్యాణ్ కి ఇదే తొలి తెలుగు సినిమా. సినిమాలో నటుడిగా ఆకట్టుకున్నది తన ఒక్కడే. అనుభవం తీసుకొచ్చే తేడా అదేనేమో. డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నాడు. పేరుకి తమిళనటుడు అయినా, ఆ వాసన ఎక్కడా ఉండదు. ఇంప్రెసివ్ డెబ్యూ అని చెప్పొచ్చు. సాయి రోనక్ చాలా ఆర్టిఫషియల్ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రయత్నాలైతే చేసాడు. క్లిక్ అవలేదు. పబ్లిసిటి డిజైనర్ భాను చేసిన కామెడి ప్రయత్నం ఎక్కడా కూడా నవ్వు తెప్పించదు. విసుగు మాత్రం తెప్పిస్తుంది.