ఇప్పటికైనా తొందరపడకు…అన్నకి ఎన్టీఆర్ సలహా

కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన వారసుడిగా,హరికృష్ణ కొడుకుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.మొదట్లో సినిమాలు ఒకటి ,రెండు బాగానే సక్సెస్ అయ్యాయి.తరువాత ఫ్లాపులు పలకరించాయి.చేసిన సినిమాలు అన్నిటిలో చాలా వరకూ సొంత బ్యానర్ మీద చేసినవే. డబ్బులు వచ్చిన సినిమాలు కంటే పోగొట్టుకున్న సినిమాలే ఎక్కువ.

ఇప్పుడు తమ్ముడు తో కలిసి చేసే “జై లవకుశ” సినిమా తో అయినా సరే తనకి అదృష్టం కలిసి వస్తుంది అని చాలా నమ్మకంతో ఉన్నాడు కళ్యాణ్ రామ్.ఈ సినిమా బిజినెస్ వంద కోట్ల వరకూ ఉంటుంది అని అంచనా ఉంది. అయితే ఈ సినిమా నిర్మాణానికి 60 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడట కళ్యాణ్ రామ్. అంటే సుమారు 40కోట్లు లాభం అన్నమాట.

కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు చేస్తున్న సినిమాలు రెండు కూడా బయట బ్యానర్స్ మీదనే అట.ఇక నుండి సొంత బ్యానర్ లో చేసే సినిమాలు విషయంలో చాలా శ్రద్దగా అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నాడట. ఈ విషయంలో ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ కి ఒక సలహా కూడా ఇచ్చాడట ఇన్నాళ్లు పోయింది, జై లవకుశ తో రికవరీ అయిపోతుంది. సో ఇకపై అనవసర ప్రాజెక్ట్స్ చేయకుండా డబ్బులు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండమని సలగా ఇచ్చాడని టాక్.అన్న దమ్ముల మధ్య మాంచి సమన్వయం ఉంది కావున కళ్యాణ్ రామ్ ఈ విషయాన్ని పాజిటివ్ గానే తీసుకున్నాడట.