పవన్ ఈ ప్రశ్నలకి జవాబు చెప్పే దమ్ము ఉందా...?     2018-04-22   02:30:29  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ పై మీడియా చేస్తున్న దాడి తీవ్రం అయ్యింది..మీడియా నా తల్లి పరువు తీసింది..టీవీ 9 ,టీవీ 5 లాంటి చానెల్స్ చూడాలి అంటే ఎంతో ఇబ్బందిగా ఉంటోంది అంటూ హాట్ హాట్ భామల పక్కన నటించిన పవన్ కళ్యాణ్ రచ్చ రచ్చ చేసిన విషయం విధితమే..అయితే మీడియా ని టార్గెట్ చేస్తూ పవన కళ్యాణ్ ఒక్క సారిగా రివర్స్ అవ్వడంతో మీడియా పెద్దలు సైతం పవన్ కి లీగల్ నోటీసు లు పంపారు..దాంతో పవన్ కళ్యాణ్ కూడా మీడియా పై ఎక్కడికైనా వెళ్తా అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు అంతేకాదు పలానా ఛానెల్స్ చూడకండి అంటూ బహిరంగంగా చెప్పడంతో మీడియాకి చిర్రెత్తు కొచ్చింది అయితే

ఇన్నాళ్ళు మీడియాని నీ సొంత లాభం కోసం వాడుకుని ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఎంతవరకూ సమజసం అంటూ అందరు ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలో గణేష్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ జవాబు చెప్పే దమ్ము లేదు అంటూ సోషల్ మీడియాలో పెద్ద పెద్ద సెటైర్స్ వేస్తున్నారు ఇంతకీ ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు ఏమిటి అంటే..

1. ఏ తల్లికి అవమానం జరిగినా స్పందించాలి. ఎక్కడ అవమానం జరిగినా ఖండించాలి. కానీ ఓ అమ్మాయి సినీ జీవితంలో కొనసాగాలంటే… శీలాన్నే ఫణం గా పెట్టాల్సి వస్తోందని రోడ్డు పైకి వస్తే.. పోలీసు స్టేషన్ కి వెళ్లాలని చెప్పిన మీరు మరి మీకు జరిగిన అన్యాయానికి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళలేదు..?

2. అమ్మకు అవమానం… ఆన్ పార్లమెంటరీ మాట…అమ్మాయిల శీలం… వీటిలో దేన్ని సీరియస్ గా తీసుకోవాలి అంటే ఏం చెప్పాలి..?

3. మన పార్టీ ఆవిర్భావం… మన సినిమాల వేడుకలు… ఆహా..ఓహో… అనే పొగడ్తలు… చేసినప్పుడు మనకు గుర్తు రాని… మీడియా యాజమాన్యాలు… వారి ఆర్ధిక లావాదేవీలు… ఇప్పుడు మనల్ని విమర్శించే వారి వార్తలు వేసినప్పుడే గుర్తుకు రావడం… ఎంతవరకు సమంజసం అని నిలదీస్తుంటే ఏమని స్పందించాలి..?