ఏ ఏ రాశివారు ఏ ప్రొఫెషన్ (వృత్తి) లో బాగా రాణిస్తారో తెలుసుకొని ముందగుడు వేయండి Devotional Bhakthi Songs Programs     2017-11-05   21:42:41  IST  Raghu V

Jobs Profiles According to Zodiac Signs for individual persons

జీవితంలో ప్రతి ఒక్కరు ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటారు. ఆ స్థితికి రావటానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలలో కొన్ని సార్లు విఫలం అవ్వవచ్చు. అలాంటి సమయంలో జన్మ రాశిని బట్టి ఏ వృత్తిలో రాణిస్తారో తెలుసుకొని ముందు అడుగు వేస్తె మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

మేషరాశి
ఈ రాశిలో జన్మించిన వారు చాలా హుషారుగా,చురుకుగా ఉండటమే కాకూండా పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు చేసే పనిలో ఛాలెంజ్ ఉండాలని కోరుకుంటారు. అందువల్ల ఈ రాశివారు రాజకీయాలు,మిలట్రీ,పోలీస్,పారిశ్రామిక వేత్తలుగా బాగా సక్సెస్ అవుతారు.

వృషభరాశి
ఈ రాశి లో జన్మించిన వారు కష్టపడే తత్వం మరియు విలాసవంతమైన జీవితం గడుపుతారు. అంతే కాదు వీరు అందంగా ఉంటారు. వీరు ఇంటీరియర్ డిజైనర్స్‌, చెఫ్‌, ఫ్యాషన్‌ డిజైనర్స్‌ లాంటి వాటిల్లో బాగా రాణింపు మరియు గుర్తింపు ఉంటుంది.

మిధున రాశి
ఈ రాశివారు చాలా స్నేహపూర్వకంగా అందరితో బాగా కలిసిపోతారు. వీరిలో చాలా టాలెంట్,తెలివి ఉండటం వలన వీరి మనస్తత్వాన్ని బట్టి టెక్నికల్‌, మార్కెటింగ్‌, సేల్స్‌ జాబ్స్‌ లో బాగా రాణించగలరు. ఎందుకంటే వీరు అందరితో స్నేహంగా ఉండుట వలన ఈ రంగాలలో బాగా రాణిస్తారు.

కర్కాటక రాశి
ఈ రాశివారు జాగ్రత్త మరియు ఎమోషనల్ గా ఉంటారు. ఏ సమస్య వచ్చిన నైపుణ్యంతో సాధిస్తారు. అందువల్ల ఈ రాశివారు టీచింగ్‌ ఫీల్డ్‌, సైకాలజిస్ట్‌, సామాజిక కార్యకర్తలుగా బాగా సక్సెస్ అవుతారు. అంతేకాక ఈ రంగాలలో మంచి పేరు సంపాదిస్తారు.

సింహరాశి
సింహరాశి లో జన్మించిన వారు మంచి పర్సనాలిటీ కలిగి ఉంటారు. వీళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టుగానే కెరీర్‌ కూడా చక్కగా ఉంటుంది. వీళ్ళ మనస్తత్వాన్ని బట్టి సీఈవో, మేనేజర్స్‌, గవర్నమెంట్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ లాంటి విభాగాలలో మంచి గుర్తింపు వస్తుంది. అందుకే ఇలాంటి రంగాలలో జాబ్స్‌ ట్రై చేయండి.