ఉద్యోగం కావాలంటే నగ్న చిత్రాలు పంపామన్నారు...ఆమె తెలివిగా ఏం చేసిందో తెలుసా.?     2018-07-03   00:40:15  IST  Raghu V

స‌మాజంలో క్రూర మృగాలు పెరిగిపోయాయి. వాటికి అడ్డు, అదుపూ ఉండ‌డం లేదు. మ‌హిళ‌లు క‌న‌బ‌డితే చాలు రెచ్చిపోతున్నాయి. వారిపై అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నాయి. వాటికి క‌న్నూ మిన్నూ క‌నిపించ‌దు. వావి, వ‌రుస, చిన్న‌, పెద్ద అనే తేడాలు ఉండ‌వు. పాశ‌వికంగా దాడి చేయ‌డ‌మే ప‌ని. అవ‌కాశం దొరికితే చాలు.. మ‌హిళ‌ల‌ను వేధింపుల‌కు గురి చేయడానికి రెడీ అవుతున్నారు. వారిని పావులుగా వాడుకునేందుకు య‌త్నిస్తున్నారు. వారికి ఉండే బ‌ల‌హీన‌త‌ల‌ను ఆస‌ర‌గా చేసుకుని మృగాళ్లు రెచ్చిపోతున్నారు.

అలంటి ఓ మృగం నుండి ఓ మహిళ తెలివిగా తప్పించుకుంది. ఆమె చేసిన పని తెలిస్తే శబాష్ అంటారు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఆమె పేరు నమ్యా బెయిడ్‌. ఉద్యోగ ప్ర‌య‌త్నాలు చేయడంలో భాగంగా తన ఫోన్ నంబ‌ర్‌ను తెలిసిన‌వారికి ఇచ్చింది. ఏదైనా జాబ్ ఉంటే చెప్ప‌మ‌ని వారికి చెప్పింది. దీంతోపాటు ప‌లు ఆన్‌లైన్ జాబ్ సైట్ల‌లోనూ తన రెజ్యూమ్‌తోపాటు తన ఫోన్ నంబ‌ర్‌ను కూడా ఇచ్చింది. అంత బాగానే ఉంది అనుకున్న టైం కి ఒక వ్య‌క్తి నుంచి న‌మ్యాకు ఫోన్‌కు వ‌చ్చింది. అత‌ను త‌న‌ను తాను దీప‌క్ అనే పేరుతో ప‌రిచ‌యం చేసుకున్నాడు. తాను ఎయిర్ ఫ్రాన్స్ ఉద్యోగిన‌ని, న‌మ్యాకు జాబ్ వ‌చ్చేలా చేస్తాన‌ని చెప్పాడు.