జేడీ లక్ష్మీనారాయణ సీక్రెట్ ఆపరేషన్     2018-04-17   00:45:24  IST  Bhanu C

సమాజంలో మంచి వాళ్లకి ఎప్పుడు ప్రత్యేక మైన స్థానం ఉంటుది..వాళ్ళు చుట్టూ ఉన్న ప్రజలని ప్రభావితం చేయగలిగిన రోజున ఒక గొప్ప లీడర్ గా ఎదుగుతారు అనడంలో సందేహం లేదు..ప్రజలు అటువంటి వారికి నీరాజనాలు పడుతారు..ముఖ్యంగా చదువుకున్న వారు కానీ ఉద్యోగులు కానీ ఇటువంటి వ్యక్తులని తప్పకుండా ఫాలో అవుతారు అయితే ఈ కోవలోకే లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ..ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత క్రేజీ వాల్ ఉన్నారు అయితే జేపీ రాజకీయంగా ఎదగలేక పోయినా సరే ఆయన వల్ల ప్రబావితం అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అనడంలో సందేహం లేదు..

అయితే తాజాగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్ ల‌క్ష్మినారాయ‌ణ తన పదవికి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేయడంతో ఇప్పుడు జేడీ పొలిటికల్ ఎంట్రీ పై ఆయనని ఫాలో అయ్యవారి ఎంతో ఆసక్తి ఏర్పడింది అయితే జేడీ మాత్రం తానూ రాజకీయాల్లోకి రావడం లేదు అయితే నేను ఎందుకు రాజీనామా చేశాను నా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది అని చెప్పడానికి త్వరలో మీడియా ముందుకు వస్తాను అని తెలిపారు..అయితే సమాజ సేవ కోసం మాత్రమే రాజీనామా చేశాను అని చెప్పే జేడీ ఆ సమాజ సేవని రాజకీయల ద్వారా చేయనున్నారు అని టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది..