జగన్ పై జేసీ నిప్పులు ! పాత గొడవలే కారణమా ..?     2018-05-30   00:10:30  IST  Bhanu C

అవకాశం దొరికితే చాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై నిప్పులు చెరుగుతూ విరుచుకుపడే బ్యాచ్ తెలుగుదేశంలో చాలామందే ఉన్నారు. వారిలో ముక్కుసూటిగా మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసే వ్యక్తి మాత్రం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి మాత్రమే. వారిద్దరికీ ఏ విషయంలో చెందిందో తెలియదు కానీ జగన్ ప్రస్తావన వస్తే చాలు జేసీ ఉగ్రరూపం దాల్చేస్తుంటాడు. నిన్న మహానాడులో కూడా జగన్ నే టార్గెట్ చేసుకున్నారు జేసీ. జగన్ ఒక అహంకారి అని, ఎవరి మాట వినరనీ, అన్నీ ఆయనకు తాతబుద్ధులే వచ్చాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

గతంలో తనను వైసీపీలో చేరమని బతిమిలాడుకున్నారని దానికి రాయబారిగా ఇప్పటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన వద్దకు వచ్చారని చెప్పారు. వచ్చిన వ్యక్తి తనను పార్టీలో చేరామనకుండా మీరు ఎంత డబ్బు ఖర్చుపెట్టగలరని నన్ను ప్రశ్నించడంతో నాకు మండి నేను మీ పార్టీలో చేరనని చెప్పేసానన్నారు. జగన్ ఎప్పుడూ డబ్బు లెక్కలే వేసుకుంటాడని అలంటి పార్టీ చేరితే విలువ ఉండదని జేసీ చెప్పుకొచ్చారు.