Jaya Janaki Nayaka Movie Review

విశ్లేష‌ణ‌:


న‌ట‌నాప‌రంగా హీరో శ్రీనివాస్ డ్యాన్సులు, ఫైట్ల‌లో మెప్పించినా ఎమోష‌న‌ల్ సీన్లు, ఎక్స్‌ప్రెష‌న్ల‌లో మాత్రం తేలిపోయాడు. ఇక ర‌కుల్‌ప్రీత్‌సింగ్ అటు అందంతోను ఇటు అభిన‌యంతోను మెప్పించింది. త‌న పాత్ర‌కు నూటికి నూరుశాతం న్యాయం చేసింది. ఇక ప్ర‌గ్య జైశ్వాల్ కూడా అందంతో అల‌రించ‌గా, శ‌ర‌త్‌కుమార్‌, జ‌గ‌ప‌తిబాబు త‌మ పాత్ర‌కుల త‌గ్గ‌ట్టుగా న్యాయం చేశారు.

ఇక సినిమాలో ప్ర‌తి ప్రేములోను టాప్ న‌టీన‌టులు ఉండ‌డంతో సినిమా ప్ర‌తి స‌న్నివేశం వాళ్ల‌కోసం అయినా చూడాల‌నిపించేలా ఉంది. ఇక సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంటుంది. సినిమాటోగ్ర‌ఫీ, దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ఫ్ అయ్యాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువ‌లు సినిమాను ఎక్క‌డికో తీసుకెళ్లాయి.

ఇక బోయపాటి విష‌యానికి వ‌స్తే సినిమా క‌థ‌, క‌థ‌నాలు రొటీన్‌గానే ఉన్నా బోయ‌పాటి మార్క్ మాత్రం స్ప‌ష్టంగా క‌న‌ప‌డింది. సినిమా అంతా మాస్ మెచ్చే స‌న్నివేశాలు, యాక్ష‌న్ సీన్లు బాగా ఎలివేట్ అయ్యాయి. ఫైట్లు అదిరిపోయాయి. అయితే బెల్లంకొండ మాస్ యాక్ష‌న్‌ను ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటార‌న్న‌ది ఒక్క‌టే చూడాలి.

ప్ల‌స్ పాయింట్స్ (+):


– బోయపాటి శ్రీను డైరక్షన్
– బెల్లంకొండ శ్రీను డ్యాన్స్ అండ్ ఫైట్స్
– రకుల్ ప్రీత్ సింగ్r/> – యాక్ష‌న్ సీన్లు
– భారీ కాస్టింగ్‌
– నిర్మాణ విలువ‌లు
– టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్స్‌

మైనస్ పాయింట్స్(-):


– హీరో ఎక్స్‌ప్రెష‌న్స్‌
– ఉహాజ‌నిత‌మైన క‌థ‌

ఫైన‌ల్ పంచ్‌:

బోయపాటి మార్క్ మాస్ మ‌సాలా జయ జానకి నాయకా

జయ జానకి నాయకా తెలుగుస్టాప్ రేటింగ్‌: 3 / 5