Jaya Janaki Nayaka Movie Review

జాన‌ర్‌: ఫ‌్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌
న‌టీన‌టులు: బెల్లంకొండ శ్రీనివాస్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌, ప్ర‌గ్య జైశ్వాల్‌, కేథ‌రిన్ థెస్రా, జ‌గ‌ప‌తిబాబు, త‌రుణ్ అరోరా త‌దిత‌రులు
బ్యాన‌ర్‌: ద్వార‌కా క్రియేష‌న్స్‌
మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌
నిర్మాత‌లు: మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: బోయ‌పాటి శ్రీను
సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ
ర‌న్ టైం: 149 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 11 ఆగ‌స్టు, 2017

టాలీవుడ్ అగ్ర‌నిర్మాత బోయ‌పాటి శ్రీను వార‌సుడిగా అల్లుడు శీను సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. తొలి సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కొట్టినా అది కాస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ అయ్యింది. ఇక రెండో సినిమా స్పీడున్నోడు ప్లాప్ అవ్వ‌డంతో లాంగ్ గ్యాప్ తీసుకుని జ‌య జాన‌కి నాయ‌క సినిమాతో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఊర‌మాస్ సినిమాలు తెర‌కెక్కించ‌డంలో తిరుగులేని డైరెక్ట‌ర్‌గా పేరున్న బోయ‌పాటి శ్రీను లెజెండ్‌, స‌రైనోడు లాంటి రెండు సూప‌ర్ హిట్ల‌తో ఫామ్‌లో ఉన్నాడు. మ‌రి బోయ‌పాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో తెలుగుస్టాప్‌.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:


ఈ సినిమా క‌థ ముందుగా కాలేజ్ నేప‌థ్యంలో సాగుతుంది. హీరోయిన్‌ను ఈవ్‌టీజింగ్ నుంచి హీరో కాపాడ‌తాడు. అక్క‌డే హీరోయిన్ ద‌గ్గ‌ర ఫస్ట్ ఇంప్రెష‌న్ కొట్టేస్తాడు. ర‌కుల్ ముందుగా హీరోను మోసం చేయాల‌ని చూసినా త‌ర్వాత అత‌డిని నిజంగానే ఇష్ట‌ప‌డుతుంది. ఇక క్రూర‌మైన విల‌న్ జగ‌ప‌తిబాబు త‌న కూతుర్నే చంపాల‌ని చూస్తుంటాడు. ఈ టైంలో హీరోయిన్ హీరోకు ప్ర‌పోజ్ చేస్తుంది. అయితే శ్రీను తండ్రి శ‌ర‌త్‌కుమార్ వీరి పెళ్లికి ఒప్పుకోడు. చివ‌ర‌కు ర‌కుల్ రిస్క్‌లో ఉంద‌ని తెలుసుకున్న హీరో ఆమెను ఎలా కాపాడాడు ? అస‌లు ర‌కుల్ ఎందుకు చిక్కుల్లో ఉంది ? వీరి ప్రేమ స‌క్సెస్ అయ్యిందా ? లేదా ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.