రాజకీయం కోసం మోడీ భార్యని వదలని...బీజేపీ     2018-06-21   03:13:31  IST  Bhanu C

పార్టీ కి హైప్ వస్తుందని అనుకుంటే ఏమి చేయడానికైనా సిద్దంగా ఉన్నారు రాజకీయ పార్టీ నేతలు..అందుకు గాను వారు చేసే జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు అయితే..ఇలాంటి రాజకీయాలు చేయడంలో ముఖ్యంగా బీజేపి పార్టీ కి వెన్నతో పెట్టిన విద్య అయితే ఈ సారి బీజేపి తన రాజకీయాలకోసం ఏకంగా ప్రధాని మోడీ వైవాహిక జీవితాన్ని ఎంచుకుంది..అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా మోడీ భార్య . జశోదాబెన్ ఫైర్ అయ్యారు మీ నీచ రాజకీయాలకోసం నన్ను ఇంతకీ దిగాజారుతారా అంటూ ప్రశ్నించారు..అసలేం జరిగింది అనే వివరాలలోకి వెళ్తే..

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి..మధ్యప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందీ బెన్, రెండు రోజుల క్రితం ఒక కార్యక్రమంలో “మీకు ఒక విషయం తెలుసా, నరేంద్రభాయి మోదీ పెళ్లి చేసుకోలేదు..అయినా, ఆయన మహిళలు, పిల్లల బాధను అర్థం చేసుకోగలరు” అంటూ బీజేపి ప్రభుత్వానికి లబ్ది చేకూర్చేలా మాట్లాడారు..ఈ వ్యాఖ్యలపై మోడీ జీ భార్య జశోదాబెన్ విచారం వ్యక్తం చేశారు..గవర్నర్ ఆనందీబెన్ చేసిన ఆ వ్యాఖ్యలపై, జశోదాబెన్, ఆమె కుటుంబ సభ్యులు చాలా కలత చెందుతున్నారు. “నరేంద్ర మోదీకి పెళ్లైందని అందరికీ తెలుసు, అయినా జనం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు” అని జశోదాబెన్ అన్నారు.