జనవరి నెలలో పుట్టిన వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు Devotional Bhakthi Songs Programs     2017-12-28   20:59:01  IST  Raghu V

January Birthday Horoscope Astrology

జనవరి నెలలో పుట్టినవారు చాల ఆకర్షణీయతను కలిగి ఉంటారు. ఈ నెలలో జన్మించిన స్త్రీలు మరియు పురుషులు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. వీరు చాలా సున్నితంగా,ఆకర్షణీయంగా,అందంగా ఉంటారు. వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవ భావం కలుగుతుంది. వీరు మంచి ఆలోచనాపరులు. అలాగే మంచి శక్తి సామర్ధ్యాలు వీరి సొంతం. ఇతరులకు సలహాలు ఇచ్చే సామర్ధ్యం కలిగి ఉంటారు. వీరి ఆలోచనలు అందరికి నచ్చుతాయి. ఎదుటి వారితో వాదన పెట్టుకొని అయినా సరే చివరకు గెలుపును సాధిస్తారు.

వీరు సాధ్యమైనంతవరకు మంచి పనులు చేయటానికి ఇష్టపడతారు. వీరిలో దైర్యం ఎక్కువ. వీరి మనస్సు చాలా మంచిది. ఎంతటి కష్టం వచ్చిన దైర్యంగా ఎదుర్కొంటారు. వీరికి చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురు అవుతాయి. సాధారణంగా ఈ నెలలో పుట్టినవారు ధనవంతులుగా ఉంటారు. పెద్ద పెద్ద ఉద్యోగాలను సంపాదిస్తారు. వీరు గొప్ప కీర్తి ప్రతిష్టలను కలిగి ఉంటారు.


ఆరోగ్యము : జనవరి నెలలో పుట్టిన వారి ఆరోగ్యము చాలా బాగుంటుంది. వీరికి రోగ నిరోధక శక్తి ఎక్కువగానే ఉన్నా సరే కొన్ని చర్మ వ్యాదులు, గర్భకోశ వ్యాధులు బాధిస్తుంటాయి.

ధనము : వీరు డబ్బును బాగా సంపాదిస్తూ పొదుపును కూడా చేస్తారు. ఎక్కువగా స్థిరాస్తులు సంపాదిస్తారు.ఈ నెలలోనే పుట్టిన వారిని వీరు వివాహం చేసుకోవటం వలన ఎక్కువ లాభం పొందుతారు.

అదృష్ట వారము : బుధ మరియు శుక్ర వారములు. అదృష్ట కలర్ : నలుపు, వంకాయ రంగు. లక్కీ స్టోన్ : మూన్ స్టోన్, ముత్యము.