5 జనవరి 2018 శుక్రవారం రోజు ఇలా చేస్తే, ఏడాది అంతా డబ్బే డబ్బు

ఈ సారి నూతన సంవత్సరం సోమవారం వచ్చింది. జనవరి 5 శుక్రవారం వచ్చింది. శుక్రవారం అంటే మహాలక్ష్మికి చాలా ప్రీతి. సంవత్సరంలో వచ్చే మొదటి శుక్రవారం ఇలా వ్రతం చేస్తే సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇలా మొదటి శుక్రవారం వ్రతం చేయటం వలన లక్ష్మి దేవి సమస్త కోరికలను తీరుస్తుంది. ఈ వ్రతాన్ని మొదటి శుక్రవారం ప్రారంభించి వరుసగా 21 వారాలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరతాయి.

ఆ రోజు తెల్లవారు జామున లేచి ఇంటిని శుభ్రం చేసి తలస్నానము చేసి లక్ష్మి దేవిని అష్టోత్తరాలు చదివి పూజ చేయాలి. ఆ తర్వాత శుక్రవారం కథ చదివి అమ్మవారికి పాలతో తయారుచేసిన నైవేద్యం పెట్టాలి. వ్రతం చివరిలో గోవును పూజించాలి. చివరి శుక్రవారం అమ్మవారిని గన్నేరు పూలతో అభిషేకం చేయాలి. అభిషేకం పూర్తీ అయ్యాక తెల్లని పూలతో పూజ చేయాలి. నైవేద్యంగా తెల్లని ప్రసాదాన్ని పెట్టాలి. పేదవాళ్లకు వెండి,బంగారు నాణేలు దానం చేస్తే కనక వర్షము కురుస్తుంది. అంతేకాక పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. మీరు కూడా కొత్త సంవత్సరంలో 21 వారాల పాటు ఈ వ్రతం చేసి మహాలక్ష్మి కృపకు పాత్రులు అవ్వండి.