Janata Garage Team Pakka Local Publicity

తాను ఐటం సాంగ్స్ చేయను చేయబోను అంటూనే జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ అంటూ టాప్ లేపిన కాజల్ ఆ సాంగ్ తో అమ్మడు ఐటం గాళ్ గా ఎంత అదరగొట్టిందో మనకు తెలిసిందే. అసలు హీరోయిన్స్ ఐటం సాంగ్స్ చేస్తే ఏ భామకు రాని క్రేజ్ కాజల్ కు దక్కింది. అఫ్కోర్స్ దేవి సాంగ్ మహిమా డ్యాన్స్ మాస్టర్ శేఖర్ స్టెప్పుల మహిమా అన్నది పక్కన పెడితే ఆ సాంగ్ తో కాజల్ ఎక్కడికో వెళ్లింది. ఈ పక్కా లోకల్ సాంగ్ వీడియో ఎప్పుడో రిలీజ్ చేశారు ఆడియో సంస్థ వారు. కాని ఇప్పుడు ఆ ట్రాక్ డిలీట్ చేసి మళ్లీ దసరా కానుకగా కాజల్ పక్కా లోకల్ వీడియో సాంగ్ అప్ లోడ్ చేయబోతున్నారట.

జనతా గ్యారేజ్ దాదాపు అన్ని చోట్ల కలక్షన్స్ డ్రాప్ అయ్యాయి మరి ఈ టైంలో ఆ సాంగ్ రిలీజ్ చేసి ఇంకా ఏమన్నా కలక్షన్స్ దక్కించుకునే ప్రయత్నమేమో అంటున్నారు. కాజల్ ఓ ఊపు ఊపేసిన పక్కా లోకల్ సాంగ్ సినిమాకే హైలెట్. మరి ఈ పక్కా లోకల్ పబ్లిసిటీ ఎవరికి ఏమాత్రం ప్లస్ అవుతుందో గాని కాజల్ పాపులారిటీ మాత్రం ఇంకా పెంచేస్తుంది అని మాత్రం చెప్పేయొచ్చు.