బీజేపీలోకి జ‌న‌సేన విలీనం.. పుకార్లా..? నిజ‌మా..?     2018-05-13   22:31:15  IST  Bhanu C

ప్ర‌శ్నిస్తానంటూ రాజ‌కీయ పార్టీ పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పొలిటిక‌ల్ ఫీట్లు ఆస‌క్తిగా మారాయి. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు, వేస్తున్న అడుగులు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ విష‌యంలోనూ ప్ర‌శ్నించ‌లేక‌పోవ‌డం, గ‌ట్టిగా నిల‌దీయ‌లేక‌పోవ‌డం ఆయ‌న‌కు మైన‌స్‌గా మారాయి. ముఖ్యంగా ఏపీకి కేంద్రం ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూల‌తో పోల్చి విమ‌ర్శించిన ప‌వ‌న్‌.. ఆ త‌ర్వాత ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం చేసింది ఏమీ క‌నిపించ‌డం ల‌దేనే విమ‌ర్శ‌లు వున్నాయి. ఇక‌, 2014 నుంచి టీడీపీ అధినేత చంద్ర‌బాబును వెనుకేసుకు వ‌చ్చిన ప‌వ‌న్‌.. ఇప్పుడు మాత్రం తీవ్రంగా విభేదిస్తున్నాడు.

అదేస‌మ‌యంలో అనుభ‌వం లేకుండానే సీఎం సీటు కోసం ఆరాట ప‌డుతున్నాడంటూ.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను విమ‌ర్శించిన ప‌వ‌న్‌.. తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌న్నెత్తు మాట కూడా అన‌లేదు. ఇక‌, ప్ర‌త్యేక హోదాపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ త‌ప్ప.. వైసీపీ స‌హా అన్ని ప‌క్షాలు పోటా పోటీగా పోరుకు సిద్ధ‌మైనా.. జ‌న‌సేన నుంచి ఒక్క నేత కూడా ముందుకు రాలేదు. పైగా.. జ‌న‌సేన నాయ‌కులు ప్ర‌త్యేక హోదాపై ఎలాంటి కామెంట్లు సైతం చేయ‌డం లేదు. దీంతో అస‌లు రాష్ట్రంలో ఇంత జ‌రుగుతు న్నా.. జ‌న‌సేన ఏం చేస్తున్న‌ద‌నే ప్ర‌శ్న‌, అనుమానం క‌లుగుతోంది.