పదే పదే అదే డైలాగులు..లోకేష్ పై పవన్ ఫోకస్.     2018-08-16   10:46:09  IST  Sai M

కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు తనయుడు లోకేష్ ని టార్గెట్ గా చేసుకుని అనేక విమర్శలకు దిగుతున్నాడు. లోకేష్ నుంచి ఏ విధమైన కౌంటర్ లు పడకుండానే పవన్ ఆయనపై విమర్శల బాణాలు వదులుతున్నాడు. అసలు సందర్భం ఏమీ లేకుండా లోకేష్ ని పవన్ ఎందుకు టార్గెట్ చేసుకున్నాడో ఎవరికీ అంతు చిక్కడంలేదు. నిన్న హైదరాబాద్ జనసేన ఆఫీసులో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం కూడా లోకేష్ మీదే విమర్శలు గుప్పించాడు పవన్.

Janasena Pawan Kalyan Focussing On Nara Lokesh,KTR,Nara Lokesh,Pawan Comments On Lokesh

ఏపీకి ముఖ్యమంత్రి అవడానికి మంత్రి నారా లోకేష్ కి ఉన్న అనుభవం ఏంటని ప్రశ్నించారు? అంతేకాదు, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తో పోల్చుతూ. ఆయనకి ఉద్యమంలో పాల్గొన్న అనుభవం ఉందనీ, ప్రజల్లోంచి గెలిచి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కి అలాంటి అనుభవం ఎక్కడుందని ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో కూడా పవన్ అటువంటి మాటలతోనే లోకేష్ ని ప్రశ్నించారు.

కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే… లోకేష్ సీఎం అభ్యర్థి అని ఎక్కడా ప్రచారం జరగడం లేదు. ఆఖరికి ఈ విషయం పై టీడీపీలోనే ఎటువంటి వ్యాఖ్యలు వినిపించడంలేదు. చంద్రబాబు కూడా లోకేష్ ని సీఎం చేస్తా అని ఎక్కడా నోరు జారలేదు. పవన్ మాత్రం లోకేష్ సీఎం అభ్యర్థి అని బలంగా ఫిక్స్ అయిపోయాడు.

విభజన తరవాత, ఇప్పుడిప్పుడే రాష్ట్రం సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఇంకోపక్క, కేంద్రం నుంచి సహకారం లభించడంలేదు. ఇటువంటి నేపథ్యంలో కేంద్రంతో ధీటుగా పోరాడే నాయకుడి నాయకత్వం రాష్ట్రానికి మరో ఐదేళ్లపాటు అవసరం అనే చర్చే ఏపీలో జరుగుతోంది. అంతేతప్ప. ముఖ్యమంత్రి అభ్యర్థులపై ఫోకస్ లేదు. ఈ విషయాన్ని పవన్ కల్యాణే ఒక్కడే పదే పదే మాట్లాడి అలజడి సృష్టిస్తున్నాడు అంతే.

Janasena Pawan Kalyan Focussing On Nara Lokesh,KTR,Nara Lokesh,Pawan Comments On Lokesh

లోకేష్ కి అనుభవం ఎక్కడిది సీఎం అవ్వడానికి అని పవన్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కి ఉన్నట్టుగా లోకేష్ కి ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం ఎక్కడిదీ అని ప్రశ్నించారు? అందరికీ ఉద్యమాల్లో పాల్గొన్న నేపథ్యమే కావాలంటే ఎలా..? మరి, పవన్ కల్యాణ్ ఏ ఉద్యమ నేపథ్యంతో రాజకీయాల్లోకి వచ్చారు? ఆయన నడిపిన, లేదా పాల్గొన్న ఉద్యమాలు ఏంటి..? ఇప్పుడు ఆయన కూడా సీఎం అభ్యర్థే కదా! పోనీ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో సీఎం అవుతారనే చర్చ తెలంగాణలో ఉంది, కనీసం ఏపీలో లోకేష్ విషయంలో అలాంటి చర్చ ఎక్కడుంది..? ఆ చర్చ నిజంగా ఉండి ఉంటే పవన్ విమర్శలకు కాస్త బలం ఉండేది.