ఉత్తరాంధ్ర లో వైసీపీ కి దడ పుట్టిస్తున్న జనసేనుడు  

నాలుగు నెలల వరకూ ఏపీలో ప్రధాన పార్టీలు అంటే కేవలం టీడీపీ ,వైసీపీ లే కానీ ఇప్పుడు ఈ లిస్టులో జనసేన పార్టీ కూడా వచ్చే చేరిపోయింది..చేరడం మాత్రమే కాదు ఇరు పార్టీలకి చుక్కలు చూపిస్తోంది..చివరకి ఏ స్థాయికి టీడీపీ వైసీపీలో వెళ్ళిపోయాయి అంటే జనసేన మద్దతు మాకు కావాలంటే మాకు కావాలి అనే పరిస్థితికి వచ్చేశాయి..పై పై కి మాకు ఎవరితో పొత్తు అవసరం లేదని చెప్తున్నా ఇరు పార్టీల చూపు చివరికి జనసేన వైపే అంటున్నారు విశ్లేషకులు సైతం..ఇక అసలు విషయంలోకి వెళ్తే…

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర ని ఉభయగోదావరి జిల్లాలలో ముగించుకుని త్వరలో ఉత్తరాంధ్ర లో అడుగు పెట్టబోతున్నాడు అయితే ఉత్తరాంధ్ర పర్యటన జగన్ కి అతి పెద్ద సవాల్ గా మారనుంది అనే టాక్ వినిపిస్తోంది..ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి కి గత ఎన్నికల్లో పోల్చుకుంటే ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ కి పట్టం కట్టిన దాఖలా ఎక్కడా లేదు అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ టోటల్ గా తన ఫోకస్ అంతా ఉత్తరాంధ్ర వైపే పెట్టాడు అక్కడి ప్రజలని తనవైపుకి తిప్పుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి..

అయితే ఈ క్రమంలో జగన్ చేపట్టే పాదయాత్ర ఏ మేరకు సక్సెస్ అవుతుందనే అంచనాలో జగన్ ఉన్నాడట అయితే ఉత్తరాంధ్ర పర్యటనకి ముందుగానే పీకీ తో పాటు ఉత్తరాంధ్ర నేతలతో జగన్ సమావేశం కానున్నాడని తెలుస్తోంది..ఈ జిల్లాలోకి వెళ్ళే ముందుగానే పవన్ మానియాని తగ్గించడానికి ఎలాంటి విషయాలని లేవనేత్తాలి..ఎలాంటి వ్యుహాలని అనుసరించాలో చర్చించనున్నారట..అంతేకాదు ఇప్పటికే పవన్ వైపు తిరిగిన ఉత్తరాంధ్ర యువతని తనవైపుకి తిప్పుకోవడానికి అక్కడ ఉన్న ప్రధాన సమస్యలపై యువత ఉపాదిపై కీలక ప్రకటనలు కూడా చేయడానికి సిద్దంగా ఉన్నాడట జగన్ మొహన్ రెడ్డి.

ఇదిలాఉంటే ఇప్పటికే పీకే ఇచ్చిన రిపోర్ట్ లో టీడీపీ, వైసీపీల కంటే కూడా అక్కడి ప్రజలు జగన్ వైపు ఎక్కువగా ఆకర్షితులు అయ్యారని తెలియడంతో ఇప్పుడు జగన్ అందరిని తనవైపుకి ఈ పాదయాత్ర ద్వారా తిప్పుకోవడానికి ఎలాంటి వ్యుహాలని సిద్డం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది.. మొత్తానికి పవన్ ఉత్తరాంధ్ర ఎఫెక్ట్ జగన్ మోహన్ రెడ్డిలో గుబులు రేపుతోంది అనడంలో సందేహం లేదు అంటున్నారు విశ్లేషకులు..