జనసేనపై భారీ కుట్ర..ఆధారాలు లభ్యం..జనసేన కీలక ప్రకటన     2018-04-20   04:40:17  IST  Bhanu C

గత కొంత కాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కుట్రలు పన్నుతూ పవన్ కళ్యాణ్ ని రోడ్డుకి ఈడ్చాలని తన ఇమేజ్ పోగొట్టాలని కొన్ని శక్తులు చేస్తున్న కుట్రలు అందరికీ తెలిసినవే అయితే పవన్ కళ్యాణ్ మాతం ఈ వ్యాఖ్యలపై స్పందిచనప్పటికీ శ్రీ రెడ్డి తన తల్లిని అన్న మాటలకి మాత్రం పవన్ ఎంతో భాదపడ్డారు నాగబాబు ఈ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి దుమ్ము దులిపిసినా సరే పవన్ కి ఇంకా తన తల్లి విషయంలో కోపం తగ్గలేదు ఈ విషయం తేల్చుకునే వరకూ ఊరుకోకూడదు అని అనుకున్నారు అందుకు తగ్గట్టుగానే ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన నిరసన తెలుపడానికి ఫిలిం చాంబర్ కి వెళ్ళారు…


తనకి న్యాయం చేసే వరకూ ఫిలిం ఛాంబర్ వదిలి వెళ్ళే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశారు..పవన్ కి మద్దతుగా మెగా ఫ్యామిలీ కూడా ఫిలిం ఛాంబర్ కి వచ్చింది అంతేకాదు అంతో మంది పవన్ మద్దతు దారులు ఫిలిం ఛాంబర్ వచ్చి పవన్ కి మద్దతు తెలుపుతున్నారు..ఇదిలాఉంటే..జనసేన టార్గెట్ గా జరుగుతున్న కుట్రల్ని త్వరలో బయట పెడుతామని జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ప్రకటించారు ..హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు..