పవన్ కళ్యాణ్ గేమ్ స్టార్ట్..ఆపరేషన్ ఆకర్ష్    2018-04-11   07:57:15  IST  Bhanu C

జనసేన పార్టీ పుట్టి ఐదేళ్ళు అవుతున్నా సరే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తోంది మాత్రం 2019 నుంచీ అయితే ఈ ఐదేళ్ళ క్రమంలో పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల మీద పార్టీల గమనం ,తీరు తెన్నులపై అవగాహన ఏర్పరుచుకున్నాడు..ఏపీ రాజకీయాలలో ఎలా ఉంటే పార్టీని నడిపించగంలం..సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి..అనే విషయాలపై ఇప్పటికే ఒక పక్క వ్యూహంతో సర్వం సిద్దం అయ్యాడు..

అంతేకాదు ఒక పార్టీలో ఉండే బలమైన నేతలని ఆకర్షించడానికి పవన్ కళ్యాణ్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది..ఏపీ రాజకీయాలని బాగా అవగాహన చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీ బలోపేతానికి తీవ్రమైన కృషి చేస్తున్నారు అందుకోసం అనుభవజ్ఞులైన నేతలని తన పార్టీలోకి వచ్చేలా వ్యూహాలు పన్నుతూ ఆపరేషన్ ఆకర్ష మొదలు పెట్టాడు ..అయితే ఇందుకోసం తెలుగుదేశం పార్టీనే తన టార్గెట్ గా చేసుకున్నాడు.