పవన్ పై జనసేన మహిళా కార్యకర్త ఆగ్రహం

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి మీకు తెలియనిది ఏముంటుంది చెప్పండి.వారిలో చాలా మందకి ఓటు హక్కు కూడా లేని వాళ్ళు ఉంటారు..సంస్కారం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటూ అనేక మంది పలు సందర్భాలలో అంటూ వచ్చారు..జనసేన..పవన్ అంటే గిట్టని వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు ఇటువంటి కామెంట్స్ అన్ని మాములుగా వస్తు ఉంటాయి అని కొట్టి పడేస్తారు కానీ..సాక్షాత్తు జనసేన మహిళా కార్యకర్త ఒకరు పవన్ పై..పార్టీపై..అభిమానులపై విరుచుకుపడ్డారు..మరి ఈ స్టొరీ ఏంటో మీరు చూడండి.

నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ ఒంగోలులో సభ పెట్టిన విషయం అందరికీ తెలిసినదే..దీనికి పెద్ద ఎత్తున అభిమానులు..కార్యకర్తలు వచ్చారు..పవన్ సీరియస్ ఇష్యూ మాట్లాడుతూ ఉండగా అభిమానులు ఈలలు, గోలలు చేస్తూ ఒకటే అల్లరి చేశారు..మధ్య మధ్యలో పవన్ వారించినా సరే వారు..వినకపోవడంతో అసహనానికి గురయిన పవన్ నాకు కావాల్సింది అరుపులు..కేకలు కాదు అంటూ చురకలు అంటించారు..అయినా పవన్ ఫ్యాన్స్ కి ఇదేమైనా కొత్తా పవన్ ఫంక్షన్ అయినా కాకపోయినా సరే వారు అరిచే అరుపులు కేకలు అనేకసార్లు ఎంతో మంది మెగా హీరోలని..మిగతా హీరోలని సైతం ఇబ్బంది పెట్టాయి.. అయితే

వేదిక మీదున్న పవన్ కళ్యాణ్ కే ఫ్యాన్స్ వల్ల దిమ్మ తిరిగిపోతే, ఎంతో ఇబ్బంది పడిపోతే…మరి ఆ సభకు వచ్చిన మహిళా కార్యకర్తల పరిస్థితి మరింత అధ్వాన్నం అంటున్నారు విజయలక్ష్మి అనే ఓ కార్యకర్త. మహిళలకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని పవన్ ప్రకటించిన తరుణంలో…ఓ మహిళా కార్యకర్త జనసేన పార్టీపై తన అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఒంగోలు సభకి వచ్చిన భాదితులే కాదు..మహిళా కార్యకర్తలు కూడా భాదితులుగా మారిపోయారు బ్రతుకుజీవుడా అంటూ సభ నుంచీ బయటకి వచ్చాము..కనీసం మహిళలు వస్తారు..అందులోనూ మహిళా కారకర్తలు వస్తారు అని తెలిసికూడా భద్రత విషయంలో కేర్ తీసుకోలేదని…మాకు సమన్వయ కార్యకర్తల సమావేశం అని మొబైల్ కు మెసేజ్ లు పంపించారని, తీరా అక్కడికెళ్తే.. అంతా అభిమానులే ఉన్నారని విజయలక్ష్మి వాపోయారు. భద్రత ఇవ్వలేనపుడు

ఆహ్వానాలు ఎందుకు పంపారని ఆమె ప్రశ్నించారు.లోపలి వెళ్ళే అవకాసం కూడా లేకుండా పోయింది..ఎలాగోఅలా లోపలి వెళ్తే ఫ్యాన్స్ ప్రవర్తనకి మేము బయపడ్డాము అని తెలిపారు…అభిమానులతో సమావేశం పెట్టుకోవడానికే అయితే.. మమ్మల్ని ఎందుకు పిలిచారని ఆమె నిలదీశారు.

సభలో తమకు ఎదురైన పరిస్థితి గురించి జనసేన అధికార ప్రతినిధితో చెప్పడానికి వెళ్తే.. మీరు పార్టీలో ఉండాలనుకుంటున్నారా?.. బయటకు వెళ్లాలనుకుంటున్నారా? అంటూ తమపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదేనా మహిళలకి మీరు ఇచ్చే గౌరవం..మీరు ఏసీ కార్లలో తిరుగుతారు..కష్టపడి పని చేసే కార్యకర్తని మాత్రం చులకన చేసి మాట్లాడుతారు మహిళలకి విలువ ఇవ్వరా అంటూ ఆవేదన చెందారు. తన తోటి మహిళా కార్యకర్తలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారని ఆమె తెలిపారు. మాకు పవన్ సభకు వచ్చినందుకు బుడ్డి వచ్చింది అని అన్నారు

,