రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న జనసేనాని..  

నాయకుడు అంటే సరైన సమయంలో ఎదురొడ్డి నిలిచేవాడే అసలు సిసలు నాయకుడు అంతేకాదు క్లిష్టమైన పరిస్థితుల్లో అందరిని వదిలేసి తప్పించుకుని తిరుగుతూ ఫాం హౌస్ లో దక్కునే వాడిని ఏమనాలు..అయితే ఇదే పరిస్థితిలో ఇప్పుడు జనసేనాని ఉన్నాడు..జన సేనాని అని పిలిపించుకునే అర్హత ఏమాత్రం కూడా పవన్ కళ్యాణ్ కి లేదు అంటూ ఏపీ ప్రజలు, మేధావులు ఇప్పుడు పవన్ పై తీవరంగా మండిపడుతున్నారు..వివరాలలోకి వెళ్తే..

ఏపీలో సంభందించి ఈరోజు ఎంతో కీలక మైన రోజు అధికార పక్షం ఒంటరిగా ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే పవన కళ్యాణ్ ఎంతో సైలెంట్ గా మిన్నకుండి పోయాడు కాసేపు ఫాం హౌస్ అంటారు కాసేపు ఇంకెక్కడో ఉన్నాడు అంటారు..ప్రభుత్వాలపై విమర్శలు చేయాలి అంటే మాత్రం రెక్కలు కట్టుకుని చంద్రబాబు జగన్ లపై తీవ్ర వ్యఖ్యలు చేసే పవన్ కళ్యాణ్ ఇలాంటి కీలకమైన సమయంలో మాత్రం సైడై పోతున్నాడు.

కేంద్రాన్ని నిలదీయాలి అంటే ఎందుకు అంత ఉలుకో అర్థం కావడం లేదు..మీడియా కంట కనపడకుండా ఉండేది కేవలం కేంద్రపై ఎక్కడ విమర్శలు చేయాల్సి ఉంటుందో అనేది పవన్ భయంగా తెలుస్తోంది..అందుకే కేవలం ట్విట్టర్ లో ఎపీకి అన్యాయం చేయద్దు అంటూ ప్రదేయపడుతున్నట్టుగా ఒక ట్వీట్ చేసి ఫైనల్ చివరికి ట్విట్టర్ రాజకీయాలకి మరో మారు తెరలేపాడు.ఒక వైపు కేంద్రంలో అవిశ్వాస యుద్ధం జరుగుతుంటే మరో వైపు పవన కళ్యాణ్ అమరావతి రైతులకు అన్యాయం జరిగిందని ట్వీట్లు చేయడం పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణికి అద్దం పడుతోంది.

అయితే ఈ విధమైన విధానం పవన్ ఎందుకు ఎంచుకున్నాడు అంటే మరో సారి మ్యాటర్ ని పక్కకి తిప్పడానికి బీజేపీ పై ఏపీ ప్రజలకి విరక్తి కలుగకుండా ప్రజల మైండ్ డైవెర్ట్ చేయానికి బీజేపీ తో పవన్ ఆడుతున్న గేమ్ అని అంటున్నారు టీడీపీ నేతలు..అయితే పవన్ ఈ విధమైన గోడమీది పిల్లి వ్యవహారాలూ పవన్ చేయడం వలన అసలుకే మోసం వచ్చి పవన్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుందనేది పవన్ అభిమానులు కార్యకర్తల వాదన ఇదే పద్దతి మటుకు కొనసాగిస్తే మాత్రం తప్పకుండా తన గొయ్యి తానె తవ్వుకున్నట్లుగా అవుతుందని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.