జై ల‌వ‌కుశ‌ మూవీ రివ్యూ

రివ్యూ: జై ల‌వ‌కుశ‌

టైటిల్‌: జై ల‌వ‌కుశ‌ న‌టీన‌టులు: న‌ంద‌
రి తార‌క‌రామారావు, రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్‌, పోసాని కృష్ణ‌ముర‌ళీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌దీప్ రావ‌త్‌, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, ప్ర‌భాస్ శ్రీను, ప్ర‌వీణ్ త‌దిత‌రులు
మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: చోటా కె.నాయుడు
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు
నిర్మాత‌: న‌ంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌
ద‌ర్శ‌క‌త్వం: కేఎస్‌.ర‌వీంద్ర (బాబి)
ర‌న్ టైం: 155 నిమిషాలు
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
రిలీజ్ డేట్‌: 21 సెప్టెంబ‌ర్‌, 2107

టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి హ్యాట్రిక్ హిట్ల‌తో కెరీర్‌లో టాప్ పొజిష‌న్‌లో ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ‌. కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం ఎన్టీఆర్ జై, ల‌వ‌, కుశ అనే మూడు పాత్ర‌ల్లో న‌టించ‌డంతో పాటు రూ.100 కోట్ల‌కు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌డంతో సినిమాపై మంచి హైప్ వ‌చ్చింది. ఎన్టీఆర్ స‌ర‌స‌న రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాకు ప‌వ‌ర్‌, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు భారీ అంచాన‌ల మ‌ధ్య వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుగుస్టాప్‌.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.