మళ్లీ ఓదార్పు యాత్ర     2015-02-05   05:43:16  IST  Bhanu C

Jagan to restart ‘Odarpu Yatra’

తెలుగు ప్రజలకు యాత్రలు అనగానే వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ గుర్తుకు వస్తాడు. ఓదార్పు యాత్రకు పెద్ద రికార్డులే ఉన్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయిలో రోజుల్లో, రికార్డు స్థాయి దూరం యాత్రలు చేసింది జగన్‌ అనే విషయం తెల్సిందే. గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే పట్టుదలతో ప్రయత్నించిన జగన్‌ విఫలం అయ్యాడు. ప్రతిపక్ష పార్టీ నేతగా మిగిలి పోయాడు. దాంతో మళ్లీ వచ్చే ఎన్నికల్లో అయినా గెలవాలనే ఉద్దేశ్యంతో ఇప్పటి నుండే యాత్రలు ప్రారంభించబోతున్నాడు.

ఈనెల 11న అనంతపురం జిల్లా నుండి జగన్‌ పరామర్శ యాత్ర ప్రారంభం కాబోతున్నట్లుగా వైకాపా నేతలు చెప్పుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుండి 85 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలను పరామర్శించడంతో పాటు, రైతుల కష్టాలను తెలుసుకునేందుకు జగన్‌ ఈ యాత్రను ప్రారంభించినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులను కూడా ప్రజల దృష్టిలోకి తీసుకు వెళ్లాలని జగన్‌ నిర్ణయించుకున్నాడని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.